ఎమ్మార్పీఎస్వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మల్లాయిపల్లి బాలిక కుటుంబానికి మందకృష్ణ పరామర్శ సామాజిక సారథి, వనపర్తి: మల్లాయిపల్లి బాలిక లైంగిక దాడి కేసును ఫాస్ట్రాక్కోర్టుకు అప్పగించాలని ఎమ్మార్పీఎస్వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మల్లాయిపల్లి బాలిక కుటుంబాన్ని ఆయన పరమార్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు, మహిళలపై లైంగిక దాడులు, హత్యలు పెరిగిపోయాయని, ఒక వారం రోజుల్లోనే చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల, వనపర్తి జిల్లా మల్లాయిపల్లిలలో […]
సూర్యాపేట ర్యాగింగ్ ఘటనపై సర్కారు సీరియస్ ఆరుగురు వైద్యవిద్యార్థులపై కేసు నమోదు సామాజికసారథి, సూర్యాపేట: సూర్యాపేట మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. ర్యాగింగ్ బాధ్యులను గుర్తించిన అధికారులు ఆరుగురు మెడికోలను సస్పెండ్ చేశారు. ఏడాది పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు కాలేజీ హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాలేజీలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీష్ రావు విచారణకు ఆదేశించిన […]
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు చివరికి రియా చక్రవర్తి మెడకు చుట్టుకుంటున్నది. ఈ కేసులో తాజాగా డ్రగ్స్ కోణం వెలుగుచూసిన విషయం తెలిసిందే. రియా డ్రగ్స్ కొనుగోలు చేసి.. సుశాంత్‌కు అందించినట్టు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. రియా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు సీబీఐకి కీలక ఆధారాలు దొరికాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దర్యాప్తు చేస్తున్నది. ఇప్పటికే సుశాంత్ మేనేజర్ శామ్యూల్, రియా సోదరుడు షోవిక్‌ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ఆదివారం రియాను […]
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణకేసులో దోషిగా తేలిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీంకోర్టు రూ. 1 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రశాంత్ భూషణ్.. గత జూన్ 27, 29 తేదీల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వివాదాస్పద ట్వీట్లు పెట్టారు. ఈ ట్వీట్లను ఎస్ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. ఆయనపై ‘ధిక్కార మరియు పరువు నష్టం’ కేసులు నమోదు చేసి విచారించింది. ఈ కేసుపై విచారించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. సోమవారం తీర్పును వెలువరించింది.
ముంబై: సుశాంత్ కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. రోజుకో ట్విస్ట్‌తో సంచలనంగా మారింది. సుశాంత్ మాజీ ప్రేయసి రియాతీరుపై తొలినుంచి అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ అనుమానాలే నిజమవుతున్నాయి. రియా చక్రవర్తికి బాలీవుడ్‌లోని ప్రముఖులతోపాటు, డ్రగ్స్మాఫియాతోనూ సంబంధం ఉన్నట్టు సమాచారం. రియాకు డ్రగ్స్‌మాఫియాతో ఉన్న సంబంధంపై సీబీఐ ఇప్పటికే పలు ఆధారాలను సేకరించింది. రియా చక్రవర్తి అమాయకురాలేంకాదని.. ఆమె మహా ముదురు కేసును అధికారులు అనుమానిస్తున్నారు. తాజాగా, నిషేధిత మాదక ద్రవ్యాల వ్యవహారంలో పాత్ర ఉందనే […]
సారథి న్యూస్, వర్ధన్న పేట : వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వర్ధన్నపేట, రాయపర్తితో పాటు చుట్టు పక్కల గ్రామీణా ప్రాంతాల్లో ప్రభుత్వ నిషేధిత గుట్కా బ్యాగుల సరఫరాకు పాల్పడుతున్న వ్యక్తిని మంగళవారం వర్ధన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి సుమారు రూ.8.10 లక్షల విలువగల గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వర్ధన్నపేట ఏసీపీ రమేశ్ వివరాలను వెల్లడిస్తూ.. గుమ్మడవెల్లి నాగరాజు అలియాస్ ఉప్పల్ నాగరాజు అలియాస్ తొర్రూరు నాగరాజు అలియాస్ […]