సారథి, రామడుగు: గతంలో మ్యుటేషన్ కోసం నెలల నుంచి ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ధరణి కార్యక్రమంతో రాష్ట్రంలోని అన్ని భూములను డిజిటలైజేషన్ చేయడం శుభపరిణామమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కరీంనగర్జిల్లా రామడుగు మండల తహసీల్దార్ ఆఫీసులో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన రైతులకు విశ్రాంతి గది, రక్షిత తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, ఆఫీస్ రెనవేషన్ రూములను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ కు […]
సారథి, చొప్పదండి: చొప్పదండి పట్టణ కేంద్రంలోని 6వ వార్డులో ఉన్న గ్రంథాలయాన్ని ఆధునికరించడానికి తక్షణమే నిధులు మంజూరుచేసి, సరైన వసతులు కల్పించాలని స్థానిక 6వ వార్డు కౌన్సిలర్ వడ్లూరి గంగరాజు శుక్రవారం ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డిని కలసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఉన్న గ్రంథాలయానికి మరమ్మతులు చేయించి కనీస వసతులు ఏర్పాటుచేసి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలన్నారు. పోటీ పరీక్షల బుక్స్ ను లైబ్రరీకి అందివ్వాలని, పేద, మధ్యతరగతి […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో రూ.ఐదులక్షల సీడీపీ నిధులతో నిర్మించనున్న గొల్ల యాదవ కురుమ సంఘం భవనం, రూ.43 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీరప్ప ఆలయం పనులకు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో దండిగా నిధులు ఖర్చుచేస్తున్నామని చెప్పారు. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమానికి ఎలాంటి లోటు రానివ్వలేదన్నారు. కులసంఘాల భవనాలు, ఆలయాలు, మురికి కాల్వలు, సీసీరోడ్లు, హైమాస్ట్ లైట్లు.. […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక వైద్య ఆరోగ్యకేంద్రంలో మంగళవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కరోనా రెండో డోసు వాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు. ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని సూచించారు. భౌతికదూరం పాటించాలన్నారు. రెండు మాస్కులు ధరించాలన్నారు. వాక్సినేషన్ తొందరగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలిచిందని ఎమ్మెల్యే తెలిపారు.
సారథి, రామడుగు: అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెడ్ల కచ్చురం లాగా సమన్వయంతో పనిచేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ సూచించారు. 45 ఏండ్లు నిండిన వారంతా విధిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఆ బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకోవాలని కోరారు. గురువారం కరీంనగర్ జిల్లా రామడుగు ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ కల్గెటి కవిత అధ్యక్షతన జనరల్‌బాడీ సమావేశం నిర్వహించారు. కరోనా దృష్ట్యా ప్రజలు మాస్కులు ధరించాలని, శానిటైసర్లు వాడేలా ప్రజాప్రతినిధులు అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. ప్రజలకు అందుబాటులో […]
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసులో పది మంది లబ్ధిదారులకు రూ.10,01,160 విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, వైస్ ఎంపీపీ పురేళ్ల గోపాల్, జడ్పీటీసీ మారుకొండ లక్ష్మి, స్థానిక సర్పంచ్ పంజాల ప్రమీల, సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటరెడ్డి, పలు గ్రామా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.