సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లిలో మంగళవారం రాత్రి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పల్లెనిద్ర చేపట్టారు. అక్కడే బసచేసి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తిచెందుతున్న వేళ ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని స్థానికులను కోరారు.
సారథి న్యూస్, రామగుండం: ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతున్నారు. తాజాగా, పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్లోని ఓ ఆస్పత్రి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేక వీడియోను రామగుండం ప్రజల కోసం విడుదల చేశారు. కరోనా మహమ్మారి పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కోరుకంటి కోరారు.
సారథి న్యూస్, రామగుండం: కాంట్రాక్ట్ కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సిబ్బందికి లాక్డౌన్ సమయంలోని ఏప్రిల్ మాసంలో 50 శాతం వేతనాలు అందించేందుకు ఆ సంస్థ యజమాన్యం అంగీకారం తెలిపారు. పాలకుర్తి మండలం బసంత్ నగర్ లో కేశోరాం ఫ్యాక్టరీ కాంట్రాక్టు కార్మికులతో ఎమ్మెల్యే మాట్లాడారు. లాక్ డౌన్ కాలంలో వేతనాలు ఇప్పించాలని కార్మికులు ఎమ్మెల్యేను కోరారు. దీంతో ఎమ్మెల్యే ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించి […]
సారథి న్యూస్, గోదావరిఖని(పెద్దపల్లి): కళను నమ్ముకుని జీవిస్తున్న కళాకారులకు కరోనా వ్యాప్తి కారణంగా కష్టాలు మొదలయ్యాయని, వారికి అండగా నిలుస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భరోసాఇచ్చారు. గురువారం ఆయన గోదావరిఖని పట్టణంలోని సీఐటీయూ ఆఫీసులో పేద కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారికి విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు. కళాకారులంతా ఐక్యంగా ఉండాలని, త్వరలోనే వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ […]