రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాళవిక అయ్యర్, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. తెలుగు డిజిటల్ ప్లాట్ ఫామ్ ‘ఆహా’లో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్‌ను నాగచైతన్య విడుదల చేశాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ‘నాదొక బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ మార్వలెస్ లవ్ స్టోరీ’ అని హీరో చెప్పే డైలాగ్ […]
జనం మరచిపోతున్న దారుణాలను కథలుగా చేసుకుని సినిమా రూపంలో తెరకెక్కించడంలో దిట్ట రామ్ గోపాల్ వర్మ. సినీ, రాజకీయ ప్రముఖుల బయోపిక్స్ తో పాటు కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తోనూ సినిమాలు రూపొందించాడు. గతేడాది నవంబర్ 26న తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటన ఆధారంగా ‘దిశ ఎన్ కౌంటర్’ పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నాడు. వర్మ శిష్యుడు ఆనంద్ చంద్ర దర్శకుడు. నట్టి కరుణ సమర్పణలో అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. శనివారం ఈ […]
కశ్యప్ కు ఆర్జీవి మద్దతు ముంబై : లైంగిక ఆరోపణలు ఎదుర్కుంటున్న బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కు మద్దతు పెరుగుతోంది. కశ్యప్ తనకు 20 ఏళ్లుగా తెలుసనీ, కానీ అతడు అలాంటి వ్యక్తి కాదని ఆర్జీవి అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘నాకు తెలిసి అతడు (అనురాగ్ కశ్యప్) చాలా సున్నిత మనస్కుడు. అతను ఎవరి మనసునైనా గాయపరిచినట్టు 20 ఏళ్లలో నేను ఇంతవరకూ వినలేదు, చూడలేదు. ఇప్పుడు ఏం జరుగుతున్నదో నేను స్పష్టంగా […]
ట్రెండ్ సెట్ చేయడంలో రియల్ స్టోరీలను నిర్మోహమాటంగా తెరకెక్కించడంలో ఆర్జీవీని మించిన వారు లేరన్నది సత్యం. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఎంత నిక్కచ్చిగా ఉంటాడో అలాగే రియల్ లైఫ్ లో కూడా అంతే నిక్కచ్చిగా ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. ఆయన సినిమాల కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోడు. ఎవరు ఏమన్నా కేర్ చేయడు. ఎన్నో చరిత్రలు తెరకెక్కించిన ఆర్జీవీ తన చరిత్రను కూడా తెరకెక్కనుందని కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశాడు. […]
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యను ఇతివృత్తంగా తీసుకొని రాంగోపాల్‌వర్మ.. మర్డర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ‘మర్డర్’ సినిమా తన కుమారుడి హత్యకేసు విచారణను ప్రభావితం చేస్తుందని.. అందువల్ల సినిమా విడుదలను నిలిపివేయాలని ప్రణయ్ తండ్రి కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్డు ఈ విచారణ పూర్తయ్యేవరకు ‘మర్డర్’ సినిమాను విడుదల చేయొద్దని సోమవారం […]
సంచలన దర్శకుడు ఆర్జీవీ పవన్‌కల్యాణ్‌పై ‘పవర్‌స్టార్’ పేరుతో ఓ వ్యంగ్య చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బుధవారం ఓ ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఈ ట్రైలర్ ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. దీంతో పవన్‌ఫ్యాన్స్ రాంగోపాల్‌వర్మపై పిచ్చికోపంతో ఉన్నారు. కానీ తమ కోపాన్ని ఎలా ప్రకటించాలో తెలియడం లేదు. వారు ఎంత రెచ్చిపోతే ఆర్జీవీకి అంత లాభం. అతడికి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిన వారవుతారు. దీంతో కొంతకాలంగా వారు మింగలేక కక్కలేక తెగ ఆయాస […]
సంచలన దర్శకుడు ఆర్జీవీకి చుక్కెదురైంది. రూ. 25 చెల్లించి పవర్‌స్టార్ ట్రైలర్‌ను చూడాలంటూ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్‌కు కొంతమంది టిక్కెట్లు కూడా కొన్నారు. కాగా ట్రైలర్‌ను అఫిషియల్‌గా రిలీజ్ చేయకముందే కొందరు ఇంటర్నెట్లో లీక్చేశారు. నిజానికి బుధవారం ఉదయం 11:00 గంటలకు ట్రైలర్ విడుదల కావాల్సివుంది. ట్రైలర్ అంతకంటే ముందే నెట్టింట్లో విడుదలైంది. విడుదలకు ముందే లీకు కావడంతో వర్మ విధిలేక ట్రైలర్ ని ఫ్రీగా యూటూబ్‌లో విడుదల చేశారు. ట్రైలర్ కోసం […]
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆర్జీవీ ఆలోచనలు ఎవరి అంచనాలకు దొరకవు. కొత్తగా ఆలోచించడంలో ఆయన తర్వాతే ఎవరైనా.. అందుకే ఇన్నేళ్లయినా.. ఎన్ని ప్లాపులు వస్తున్నా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ‘పవర్‌స్టార్’ అనే ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా ఎవరిగురించి తీస్తున్నాడో ఎల్కేజీ పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఆ చిత్రానికి సంబంధించి త్వరలో ఓ ట్రయిలర్ రిలీజ్ చేయబోతున్నాడు. కాగా ఈ ట్రయిలర్కూ కూడా రూ.25 టికెట్టు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు […]