హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఆర్డీవోలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్ ఆర్డీవోగా ఎస్.మోహన్‌రావు నియమితులయ్యారు. అలాగే ఎల్లారెడ్డి ఆర్డీవోగా ఎస్.శ్రీను, ఆందోల్-జోగిపేట ఆర్డీవోగా వి.విక్టర్, వనపర్తి ఆర్డీవోగా పి.అమరేందర్, నిర్మల్ ఆర్డీవోగా రాథోడ్ రమేష్, బాన్స్ వాడ ఆర్డీవోగా బి.రాజాగౌడ్, మేడ్చల్-మల్కాజ్‌గిరి ఎస్డీసీగా జి.లింగ్యానాయక్ నియమితులయ్యారు.
సారథి న్యూస్, సూర్యాపేట : సూర్యాపేట ఆర్డీవో ఎస్. మోహన్ రావు బదిలీ అయ్యారు. మూడు సంవత్సరాలుగా సూర్యాపేట ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న ఆయన అకస్మాత్తుగా బదిలీ కావడం కొంత చర్చానీయాంశమైంది. ఆయన వెయిటింగ్ పోస్టులో ఉన్నప్పటికీ సూర్యాపేట నూతన ఆర్డీవో గా కే.రాజేంద్ర కుమార్ ను నియామిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సారథి న్యూస్, కల్వకుర్తి: కరోనా మహమ్మారిని నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ డౌన్ ను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఆర్డీవో రాజేష్ కుమార్ హెచ్చరించారు. గురువారం ఆయన జిల్లాలోని వెల్దండ పోలీస్ చెక్ పోస్టును సందర్శించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలోకి రానివ్వకూడదని ఆదేశించారు. మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఎవరూ బయటికి […]