Breaking News

అలంపూర్

అలంపూర్​– పెద్దమరూర్ వద్ద బ్యారేజీ కట్టితీరుతం

అలంపూర్​– పెద్దమరూర్ వద్ద బ్యారేజీ కట్టితీరుతం

ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఇకనుంచి కుదరదు తెలంగాణ సమాజం పోతిరెడ్డిపాడును వ్యతిరేకిస్తోంది అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్ రావు సారథి న్యూస్, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో మాదిరిగా తన పద్ధతిని మార్చుకోకుండా కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపకుంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్ – పెద్దమరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతుందని, తద్వారా రోజుకు మూడు టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. నదీజలాల విషయంలో తెలంగాణకు […]

Read More
11 ఏళ్లుగా మానని వరద గాయం

11 ఏళ్లుగా మానని వరద గాయం

అన్నీ కోల్పోయిన కృష్ణా, తుంగభద్ర నదీతీర వాసులు ఎవరిని పలకరించినా కన్నీళ్లే నేటికీ ఇండ్లు కట్టలే.. స్థలాలు ఇవ్వలే మద్దూర్ లో నేటికీ అడుగుపెట్టని జిల్లా కలెక్టర్, మంత్రులు సారథిన్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా తుంగభద్ర, కృష్ణానది తీర గ్రామాల ప్రజల్లో నాటి వరద భయం ఇంకా వీడడం లేదు. చిన్నపాటి వర్షం వచ్చిన నదులు పొంగుతాయని, వరద వస్తుందేమోననే గుబులు వెంటాడుతోంది. 11 ఏళ్ల క్రితం..2009 అక్టోబర్​ 2న సంభవించిన ఆ రెండు […]

Read More
పొంగిన వాగులు.. తెగిన రోడ్లు

పొంగిన వాగులు.. తెగిన రోడ్లు

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జిల్లాలోని అలంపూర్​నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీవర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. అంతర్రాష్ట్ర రహదారి రాయిచూర్ మార్గంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు వెళ్లలేక 40 నుంచి 60 కి.మీ. దూరం మేర గద్వాల మీదుగా ప్రయాణిస్తున్నారు. అలాగే మానవపాడు మండల కేంద్రంలో అమరవాయి వాగు ఉప్పొంగడంతో ఏడు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మండలంలోని పత్తి పంటలు నీట మునిగాయి. మానవపాడు […]

Read More
కోతకు గురైన రాయిచూర్​రహదారి

కోతకు గురైన రాయిచూర్​ రహదారి

స్తంభించిన వాహనాల రాకపోకలు చిన్నపాటి వర్షమొస్తే ఇదే పరిస్థితి సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక ఎప్పటిలాగే జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెళ్లి మండలం బొంకూర్ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర రాయిచూర్​రహదారి కోతకు గురైంది. అర్ధరాత్రి నుంచి రాకపోకలు స్తంభించిపోయాయి. రాయిచూర్​కు వెళ్లాలంటే వయా కలకుంట్ల మీదుగా హైవే నం.44, అలంపూర్ చౌరస్తా వరకు 25 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. మూడేళ్లుగా ఈ పెద్ద వాగుపై బ్రిడ్జిని […]

Read More
అలంపూర్​లో నిరసన తెలుపుతున్న ఓ కుటుంబం

జీతాల్లేక పస్తులుంటున్నాం

సారథి న్యూస్​, అలంపూర్: జూన్​ నుంచి తమకు జీతాలు ఇవ్వడం లేదని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పీటీఐలు (పార్ట్​ టైం ఇన్​స్ట్రక్టర్​) ఆందోళన చేపట్టారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో సుమారు 240 మంది పీటీఐలు పనిచేస్తున్నారు. వీరంతా సర్వ శిక్షా అభియాన్​ కింద పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవాలని.. తమకు జీతభత్యాలు ఇవ్వాలని వారు డిమాండ్​ చేశారు. ఇండ్ల వద్ద ఉండి కుటుంబసమేతంగా ఆందోళనకు దిగారు.

Read More

హరితహారం స్వర్ణహారం కావాలి

సారథి న్యూస్, అలంపూర్: ఆలంపూర్ జోగుళాంబ పుణ్యక్షేత్రం ఆవరణలో మొక్కలు నాటి ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని మున్సిపల్​చైర్మన్​వెంకటేశ్, కమిషనర్​మదన్​మోహన్​గురువారం ప్రారంభించారు. హరితహారం స్వర్ణహారం కావాలని వారు ఆకాంక్షించారు. మున్సిపాలిటీలో ఒక్కో వార్డులో వంద మొక్కల చొప్పున నాటడమే కాకుండా ప్రతి ఇంటికి మూడు మొక్కల చొప్పున నాటాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వ ఆఫీసుల మైదానాల్లో మొక్కలు నాటాలని సంకల్పించారు. అంతకుముందు ప్రభుత్వ జూనియన్​ కాలేజీ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పుష్పలత, జయలక్ష్మి, టీఆర్ఎస్ […]

Read More

గ్రహణం ఎఫెక్ట్​

సారథి న్యూస్​, అలంపూర్​: అష్టాదశశక్తి పీఠాల్లో ఐదో శక్తిపీఠమైన తెలంగాణలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని చూడామణి సూర్యగ్రహణం సందర్భంగా ఆదివారం అర్చకులు మూసివేశారు. ఉదయమే అమ్మవారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి ఆలయ ద్వారాలకు తాళాలు వేశారు. శుద్ధి సంప్రోక్షణ తర్వాత ప్రత్యేకపూజలు చేసి మహా మంగళహారతితో సోమవారం ఆలయాన్ని తెరవనున్నారు.

Read More
ఆర్ఎంపీ మృతికి నివాళి

ఆర్ఎంపీ మృతికి నివాళి

సారథి న్యూస్, అలంపూర్: మూడు రోజుల క్రితం మృతిచెందిన అలంపూర్ కు చెందిన ఆర్ఎంపీ తిమ్మప్ప మృతికి శనివారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు.అలంపూర్ లో పేదల వైద్యుడిగా గుర్తింపు పొందిన ఆయన మృతి తీరని లోటని ప్రముఖ న్యాయవాది నాగరాజు యాదవ్ అన్నారు.అలాగే పట్టణ ప్రజలంతా స్వచ్ఛందంగా వారి ఇళ్ల వద్ద భౌతిక దూరం పాటిస్తూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్ పాల్గొన్నారు.

Read More