Breaking News

అనుమతి

షూటింగ్​లకు అనుమతి

న్యూఢిల్లీ: సినిమాలు, టీవీ సీరియల్స్​ షూటింగ్​లకు కేంద్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అన్​లాక్​ 3.0 మార్గదర్శకాల్లో భాగంగా షూటింగ్​లకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఉదయం కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్​ జవదేకర్​ మార్గదర్శకాలను విడుదల చేశారు. బహిరంగ ప్రదేశాల్లో యూనిట్​ సిబ్బంది తప్పనిసరిగా మాస్క్​లు ధరించాలని నిబంధనల్లో సూచించారు. నటీనటిలంతా ఆరోగ్యసేతు యాప్​ను ఉపయోగించాలని.. షూటింగ్​ సమయంలో విజిటర్లను అనుమతించవద్దని సూచించారు. మేకప్​ సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలని సూచించారు. వీటితోపాటు చిత్రీకరణ […]

Read More

నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు

సారథిన్యూస్​, రామగుండం: రామగుండం కమిషనరేట్​ పరధిలో గణేశ్​ మండపాలకు అనుమతి లేదని.. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మండపాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని కమిషనర్​ సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసులకు వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. కరోనా నివారణ గురించి అధికారులు సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. తప్పకుండా మాస్కులు, గ్లౌజులు ధరించాలని సూచించారు.

Read More

గణేశ్​ మండపాలకు నో పర్మీషన్​

సారథిన్యూస్​, ఖమ్మం: ఖమ్మం పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో గణేశ్​ మండపాల ఏర్పాటుకు అనుమతి లేదని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పేర్కొన్నారు. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో ప్రజలంతా ఇంట్లోనే ఉండి గణేశ్​ పండుగను జరుపుకోవాలని సూచించారు. మొహర్రం పండుగను సైతం ముస్లిం సోదరులు ఇండ్లల్లోనే నిర్వహించుకోవాలని కోరారు. ఎవరైనా పోలీసుల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read More