Breaking News

అనారోగ్యం

నిరాడంబర నేత దుర్గాప్రసాద్​

సారథి న్యూస్​, అమరావతి: అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన దుర్గాప్రసాద్​కు పేదల నేతగా ప్రజల్లో పేరుంది. నిత్యం ప్రజలతో కలిసిమెలిసి ఉంటే దుర్గాప్రసాద్​ నిరాడంబరంగా మెలిగేవారు. తన అనుచరులను నిత్యం పేరుపెట్టి పిలుస్తూ పలకరించేవారు. ఏ కష్టమొచ్చినా వెంబడే స్పందించారు. అలాంటి నేత తమ మధ్య లేకపోవడంతో కార్యకర్తలు నిర్ఘాంతపోయారు. ఇదీ రాజకీయ చరిత్ర..టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్​ పిలుపుతో 26 ఏళ్ల వయస్సులోనే దుర్గాప్రసాద్​ రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు ఆయనకు నెల్లూరు మంచి లాయర్​గా పేరు ఉండేది. […]

Read More
సోనియా గాంధీ డిశ్చార్జ్​

సోనియా గాంధీ డిశ్చార్జ్‌

న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదివారం డిశ్చార్జ్​ అయ్యారు. జూలై 30న న్యూఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిలో ఆమె చేరారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి ఆమెను డిశ్చార్జ్‌ చేసినట్టు ఆస్పత్రి చైర్మన్‌ డీఎస్‌ రాణా తెలిపారు. కాగా.. గత ఫిబ్రవరి నెలలో కడుపు నొప్పి కారణంగా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.

Read More
శేఖర్​ కమ్ముల

శేఖర్​ కమ్ముల ఇంట విషాదం

ప్రముఖ దర్శకుడు శేఖర్​ కమ్ముల ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. ఆయన తండ్రి శేషయ్య శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడతున్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం సికింద్రాబాద్​ బన్సీలాల్​ శ్మశానవాటికలో శేషయ్యకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పలువురు సినీ ప్రముఖులు శేఖర్​ కమ్ములకు ఫోన్​ చేసి సంతాపం తెలిపారు. ప్రస్తుతం శేఖర్​ కమ్ముల నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా ‘లవ్​స్టోరీ’ అనే సినిమా తీస్తున్నాడు. సినిమా షూటింగ్​ పూర్తయినప్పటికీ కరోనా లాక్​డౌన్​తో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.

Read More
సూపరింటెండెంట్​ రాజీనామా

ఎంజీఎం సూపరింటెండెంట్​ రాజీనామా

సారథిన్యూస్​, వరంగల్​: ఉమ్మడి వరంగల్​ జిల్లాలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన అయిన ఎంజీఎం సూపరింటెండెంట్​ డాక్టర్​ శ్రీనివాసరావు రాజీనామా చేశారు. తాను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని అందుకే రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు. కాగా ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో జరిగిన పరిణామాల వల్లే అతడు రాజీనామా చేసినట్టు సమాచారం. తెలంగాణలోని పలువురు వైద్యులు కరోనా పరిణామాలతో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల జూనియర్​ డాక్టర్లు ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. […]

Read More

సరోజ్​ఖాన్​ ఇకలేరు

దిగ్జజ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ (71) కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతిచెందారు. గతనెల 20న ఆమె శ్వాసకోసం ఇబ్బందులతో ముంబైలోని గురునానక్​ దవాఖానలో చేరారు. అనంతరం ఆమె పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్జి చేశారు. ఇంతలోనే ఆమె కన్నుమూయడంతో బాలీవుడ్​ సినీపరిశ్రమలో విషాదం నెలకొన్నది. సరోజ్​ఖాన్​ దాదాపు రెండువేల పాటలకు సరోజ్​ఖాన్​ కొరియోగ్రాఫ్​ అందించారు. దేవదాస్​లోని డోలారే డోలాకు ఆమె కొరియోగ్రఫీ చేశారు. శ్రీదేవి నటించిన […]

Read More

పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్

సారథి న్యూస్, రామాయంపేట: సీఎం రిలీఫ్​ ఫండ్​ పేదలకు వరం లాంటిదని నిజాంపేట ఎంపీపీ సిద్దరాములు పేర్కొన్నారు. మెదక్​ జిల్లా నిజాంపేట మండలం తిప్పనగుళ్ల గ్రామానికి చెందిన నీలం నర్సయ్య ఇటీవల అనారోగ్యానికి గురికాగా అతడికి రూ. 60 వేల సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కును అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్​ జయరాం, ఎంపీటీసీ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More