సారథి న్యూస్, హైదరాబాద్: మొక్కజొన్న పంట సాగు, నిల్వలకు సంబంధించి దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పంట సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదని వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించే పరిస్థితులు లేకుండా పోయాయని అన్నారు. ‘ఎవరైనా ఎక్కడైనా పంటను అమ్ముకోవచ్చు.. కొనుక్కోవచ్చు’ అనే కేంద్ర కొత్త వ్యవసాయ చట్టాల విధానం […]
టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు ఇంకా అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్ సారథి న్యూస్, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రముఖంగా త్రిముఖ పోరు కనిపిస్తోంది. ఎవరికివారు బలనిరూపణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మంగా పావులు కదుపుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్రపోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా తన […]
బలహీనులపై దాడులు జరగకుండా చూడాల్సిందే.. గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపాల్సిందే పోలీసు, అటవీశాఖ ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: అభివృద్ధి పథాన ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం, శాంతిభధ్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్న వార్తలు వినడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితి నుంచి సమాజం దూరం కావాలని ఆకాంక్షించారు. బలహీనుల మీద బలవంతుల దాడులు జరగకుండా […]
నాకొచ్చే జీతం ఆధారంగా ఈఎంఐ పెట్టుకుని… హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొన్న. ప్రతినెలా 5వ తారీఖున నా బ్యాంకు అకౌంట్లోంచి ఈఎమ్ఐకి డబ్బులు కట్ అవుతాయి. ఆ సమయంలో అకౌంట్లో డబ్బుల్లేకపోతే బ్యాంకు వాళ్లు పెనాల్టీ వేస్తారు. చక్రవడ్డీలు, బారువడ్డీలతో బీభత్సంగా డబ్బులు లాగుతారు.:: ఇది హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన సారథి న్యూస్, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు.. ఇప్పటి వరకూ వీరి వేతనాలు, జీతాలు, భత్యాలు, ఒకటో తారీఖున ఠంచన్‌గా బ్యాంకు […]
ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఇకనుంచి కుదరదు తెలంగాణ సమాజం పోతిరెడ్డిపాడును వ్యతిరేకిస్తోంది అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్ రావు సారథి న్యూస్, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో మాదిరిగా తన పద్ధతిని మార్చుకోకుండా కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపకుంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్ – పెద్దమరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతుందని, తద్వారా రోజుకు మూడు టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. నదీజలాల విషయంలో తెలంగాణకు […]
సారథి న్యూస్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి వేడుకలు ఘనంగా శుక్రవారం జరిగాయి. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం సైతం వేడుకలను ఘనంగా నిర్వహించింది. లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వద్ద మహాత్ముడి విగ్రహానికి గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయం, రైతులను కాపాడుకునే విషయంలో.. దేవుడితోనైనా కొట్లాటకు సిద్ధమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల అంశంపై అక్టోబర్ 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. అనుసరించాల్సిన వ్యూహాన్ని గురువారం ప్రగతిభవన్ లో జలవనరులశాఖ ఉన్నతాధికారుల ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ఖరారు చేశారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని, స్వరాష్ట్రంలో వ్యవసాయరంగంలో పండుగ […]
నదీ జలాల విషయంలో కావాలనే ఏపీ కయ్యం నీటిపారుదల శాఖ అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం సారథి న్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం ప్రగతిభవన్ లో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలను, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను తీసుకుని సమావేశానికి రావాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం […]