సారథిన్యూస్, రామడుగు: మోకాళ్ల నొప్పులు తట్టుకోలేక.. నడువలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంగనగర్ జిల్లా రామడుగు మండలం గండికి చెందిన జనగం రాజయ్య (80) కొంతకాలంగా నడవలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడికి ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడు కమలాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అనూష తెలిపారు.
న్యూఢిల్లీ: కంటికి కనిపించని ఈ మహమ్మారి వృద్ధులు, చిన్నారులకు అంటుకుంటే డేంజర్ అని డాక్టర్లు హెచ్చరిస్తుండగా.. ఢిల్లీకి చెందిన ఈ 106 ఏళ్ల వృద్ధుడు మాత్రం వ్యాధి నుంచి కోలుకున్నాడు. 70 ఏళ్ల తన కొడుకు కంటే తొందరగా కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(ఆర్‌జీఎస్‌ఎస్‌హెచ్)లో చేరిన ఆ పేషంట్‌కు వైరస్ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ తొందరగా రికవరీ అయ్యారని హాస్పిటల్ వర్గాలు చెప్పాయి. ఆ వృద్ధుడికి […]
సారథిన్యూస్, నిజామాబాద్: చాక్లెట్ ఆశచూపి ఓ వృద్ధుడు ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నారాయణ ( 55) అనే వ్యక్తి ఎనిమిదేళ్ల ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేశాడు. ఇద్దరు చిన్నారులకు గత 15 రోజులుగా చాక్లెట్ ఆశ చూయించి పాడుబడ్డ ఇంట్లో లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంట్లో చెప్తే చంపుతానని బెదిరించాడు. కడుపునొప్పి తాళలేక చిన్నారులు కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. దీంతో […]
చెన్నై: దుర్మార్గుడైన ఓ వృద్ధుడు భార్య గొంతుకోసి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో వెలుగుచూసింది. పెరుంగలాథూర్ ప్రాంతంలోని డేవిడ్ నగర్‌లోని ఓ ఫ్లాటులో జగన్నాథన్ (72), అతడి భార్య సులోచన (62)లు నివాసముండేవారు. అపార్టుమెంట్ పై జగన్నాథన్ మృతదేహాన్ని చూసిన అపార్టుమెంటు వాసులు విషయాన్ని ఆమె భార్యకు చెప్పేందుకు వారి ఫ్లాటుకు వెళ్లి చూడగా రక్తపు మడుగులో సులోచన కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఇద్దరి […]