Breaking News

రామడుగు

వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్

వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గుండిగోపాల్ రావుపేట ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలోని వ్యాక్సినేషన్ సెంటర్ ను కలెక్టర్ శశాంక బుధవారం సందర్శించి వ్యాక్సినేషన్ తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతిఒక్కరూ వాక్సిన్ వేసుకునేలా మోటివేషన్ చేయాలని సూచించారు. కరోనా పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలు రావడం లేదని, అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని సర్పంచ్, ఉపసర్పంచ్, వైస్ ఎంపీపీ కలెక్టర్ శశాంకను కోరారు. ఆయన వెంట ఎంపీడీవో మల్హోత్రా, తహసీల్దార్ కోమల్ రెడ్డి, ఎంపీవో సతీష్ రావు, రామడుగు […]

Read More
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి

సారథి, రామడుగు: రైతులకు అసౌకర్యం కలిగించకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ నిర్వాహకులకు చూచించారు. మండలంలోని వెదిర ఫ్యాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ కోమల్ రెడ్డి తో కలిసి సందర్శించారు. ఇప్పటివరకు ఎంత మొత్తంలో కొనుగోలు చేశారనే విషయాలను నిర్వాహకుల నుంచి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జేసీ దృష్టికి తెచ్చారు. ఆయన వెంట మండల […]

Read More
మెడికల్ కాలేజ్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా?

మెడికల్ కాలేజ్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా?

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లాకు మెడికల్ కాలేజీకి ఉంటే కరోనా విషయంలో ఈ పరిస్థితి ఉండేదా? అని కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు ప్రశ్నించారు. మంగళవారం రామడుగు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ మాట కూడా ఎత్తకపోవడం జిల్లా ప్రజలను మోసం చేసినట్లు కాదా? అని ప్రశ్నించారు. మంత్రి గంగుల కమలాకర్, జిల్లా ఎమ్మెల్యేలు కనీసం జిల్లా ప్రజల ఆరోగ్య అవసరాల […]

Read More
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట్ లో ప్రతి లచ్చయ్య ఇటీవల కరోనతో మృతిచెందాడు. కుటుంబాన్ని ఆదుకునేందుకు యువకులు సేకరించిన రూ.40వేలను మంగళవారం బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కర్ర సత్యప్రసన్న, ఎంపీటీసీ ఎడవెళ్లి నరేందర్, ఉపసర్పంచ్ ఎడవెళ్లి మధుసూదన్ రెడ్డి, ఎక్సైజ్ ఎస్సై విజయ్, సిద్దార్థ, పురాణం రమేష్, టేకు రాజేశం పాల్గొన్నారు.

Read More
కరోనా బాధితురాలికి ఆశ్రయం

కరోనా బాధితురాలికి ఆశ్రయం

సారథి, రామడుగు: మానవత్వం ఇంకా బతికే ఉందన్నదానికి ఈ సాయమే నిదర్శనం. కరోనా బాధితురాలిని అద్దె ఇంట్లో నుంచి గెంటివేస్తే వారికి ఆశ్రయం కల్పించి మానవత్వం చాటుకున్నారు ఓ మంచి మనిషి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేటలో కరోనా బారినపడిన కుటుంబానికి అద్దెకు ఇచ్చిన యజమాని తమ ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. వెంటనే ఆ కుటుంబానికి సర్పంచ్ సత్యప్రసన్న చేయూత ఇచ్చారు. రెండ్ల మల్లేశం ఆ కుటుంబ పరిస్థితిని వారికి తీసుకుపోవడంతో నిర్మాణదశలో ఉన్న […]

Read More
నిరాడంబరంగా రంజాన్

నిరాడంబరంగా రంజాన్

సారథి, రామడుగు: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం పండగలపై పడింది. అందులో భాగంగానే శుక్రవారం రంజాన్ నిరాడంబరంగా ఇంట్లోనే జరుపుకున్నారు. ఉదయాన్నే ఇంట్లోనే నమాజ్ చేసి సెమియా, బిర్యానీ వంటి వంటకాలు తయారుచేసి భుజించారు.

Read More
గొప్ప మనసున్న మారాజు ఆ సర్పంచ్

ఆ సర్పంచ్ మనసేంత గొప్పదో

సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి పట్ల రామడుగు మండలం గోపాల్ రావుపేట సర్పంచ్ కర్ర సత్యప్రసన్న ఉదారత చాటుకున్నారు. లాక్ డౌన్ తో అంబులెన్స్ లు, ఇతర వాహనాలు దొరక్క హాస్పిటల్ కు వెళ్లలేని వారి కోసం స్వయంగా తన సొంత కారును గురువారం నుంచి అందుబాటులో ఉంచారు. పెట్రోల్, డ్రైవర్ ను సంబంధిత వ్యక్తులే చూసుకోవాలని సర్పంచ్ సత్యప్రసన్న సూచించారు. […]

Read More
మీకు నేనున్నా...

మీకు నేనున్నా…

సారథి, రామడుగు: ఓ మనసున్న మారాజు ఉండేది విదేశాల్లోనైనా తన స్వగ్రామంలోని నిరుపేదలకు తనవంతు సాయమందిస్తూ పేద కుటుంబాల్లో దేవుడయ్యాడు. అది ఎక్కడో చూద్దాం పదండి. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన తోట సత్యం తన కుటంబంతో సహ అమెరికాలో స్థిరపడ్డాడు. సత్యంకు తన ఊరంటే ఏనలేని ప్రేమతో పేదింటి విద్యార్థుల చదువు, పెళ్ళిలు, వృద్ధులకు పెన్షన్లు, తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ గ్రామంలో తనకంటూ ఓ సముచిత స్థానం […]

Read More