సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో 67 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. శనివారం మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మెదక్ టౌన్ లోని ఫతేనగర్ లో మూడు, రాంనగర్ వీధిలో ఒకటి, కౌడిపల్లి మండలం కంచాన్ పల్లిలో ఒకటి, చేగుంట మండలం రాంపూర్ లో ఒకటి, కర్నాల్ పల్లిలో ఒకటి, చేగుంటలో ఒకటి, తూప్రాన్ మండలం ఘనపూర్ లో ఒకటి, పాపాన్నపేట మండలం ఎల్లాపూర్ […]
సారథి న్యూస్, మెదక్: మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, వాటిని బతికిస్తేనే హరితహారం కార్యక్రమానికి సార్థకత ఉంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. శనివారం నర్సాపూర్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ స్కూలు ఆవరణలో కలెక్టర్ మొక్కను నాటి నీళ్లుపోశారు. స్కూలు ఆవరణలో వెయ్యి మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. వాటికి ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు మొక్కలను దత్తత ఇచ్చి కాపాడే […]
సారథి న్యూస్, మెదక్: రైతులకు ఏ ఇబ్బంది రానివ్వబోమని, పంటల సాగుకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట మండలం కొత్తపేట, రత్నాపూర్ గ్రామాల్లో డంపింగ్ యార్డులను ప్రారంభించారు. కొత్తపేట గ్రామంలో మొక్కలు నాటి, రత్నాపూర్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి భూమిపూజ చేశారు. నాట్లు వేస్తున్న రైతుల వద్దకు వెళ్లి ఏయే పంటలు వేస్తున్నారు, పంట నియంత్రిత సాగు విధానంతో కలిగే లాభాలను […]
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తోంది. లాక్ డౌన్ సమయంలో కేవలం వేళ్లపై లెక్కపెట్టే కేసులు మాత్రమే ఉండగా, లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు దండిగా నమోదవుతున్నాయి. నెలరోజుల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా 40 మందికి కరోనా ప్రబలడంతో గమనార్హం. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 45కు చేరింది. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణం, తూప్రాన్, రామాయంపేట పట్టణాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. జిల్లాకు […]
సారథి న్యూస్, మెదక్: రైస్ మిల్లర్లు ఫుడ్ కార్పొరేషన్ కు బియ్యం త్వరగా సరఫరా చేయాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ఆదేశించారు. వానాకాలం బియ్యం సేకరణపై శనివారం కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్లిష్టసమయంలోనూ టార్గెట్ మేరకు ధాన్యం సేకరించినందుకు మిల్లర్లను అభినందించారు. బియ్యం కూడా త్వరగా ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాకు అదనంగా కేటాయించిన రా బియ్యం 2,700 టన్నులను బాయిల్డ్ మిల్లర్లు ఈనెల 15 వరకు ఎట్టిపరిస్థితుల్లోనూ అందజేయాలని […]
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామంలో తొలి కరోనా కేసు నమోదైంది. మేడ్చల్ లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు తేలడంతో వైద్యసిబ్బంది హోం క్వారంటైన్ ముద్రవేశారు. అయినప్పటికీ సదరు వ్యక్తి నార్లాపూర్ లో ఉన్న తన బంధువుల వద్దకు వెళ్లడంతో శుక్రవారం వారిని కూడా వైద్యపరీక్షల కోసం తీసుకెళ్లారు.
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటు కానుంది. వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ బుధవారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేశారు. వెల్దుర్తి మండలంలోని 6 గ్రామాలు, చేగుంట మండలంలోని 3 గ్రామాలను కలిపి కొత్త మండలం ఏర్పాటు కానుంది. గతనెల 25న హరిత హారం కార్యక్రమ ప్రారంభం కోసం సీఎం కేసీఆర్ నర్సాపూర్ కు వచ్చిన సందర్భంగా […]
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లా కలెక్టర్ ఓ సర్పంచ్ పై సస్పెన్షన్ వేటువేశారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోవడం, నిధుల దుర్వినియోగం నేపథ్యంలో మనోహరాబాద్ మండలం కళ్లకల్ సర్పంచ్ ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతనెల 6న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కళ్లకల్ గ్రామాన్ని సందర్శించారు. హరితహారం మొక్కలు చనిపోవడంతో పాటు తడి పొడి చెత్తను వేరు చేయకపోవడం, గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంపై కలెక్టర్ సర్పంచ్ […]