సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పట్టణంలో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ చరణ్ సింగ్ కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. తిరుమలాపూర్ లో సర్వే నంబర్ 1, 256లో భూములు కబ్జాకు గురవుతున్నాయని తెలిపారు. వాటిని అక్రమ లేఅవుట్లుగా మార్చి విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు రాయని […]
సారథి, రామాయంపేట: కొన్ని గంటల్లోనే పెళ్లి జరగనుంది. సంతోషాల మధ్య శుభకార్యం జరగాల్సిన ఆ ఇంటిలో చావు డప్పు మోగింది. పుస్తెమట్టెలను తీసుకొచ్చేందుకు వెళ్లిన పెళ్లికొడుకు తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన గురువారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని 44వ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం.. పులిమామిడి గ్రామానికి చెందిన మందపురం రాజయ్య(55) చిన్నకుమారుడు గణేష్ వివాహం నగరం గ్రామంలో జరగాల్సి ఉంది. పులిమామిడి నుంచి రామాయంపేటకు వచ్చి పుస్తెమట్టెలు […]
సారథి, నిజాంపేట: మెదక్ జిల్లా రామాయంపేటలో ఆదివారం సాయంత్రం 8బ్రహ్మకమలాలు వికసించాయి. ఈ పూలను దర్శించిన వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మెదక్ జిల్లా రామాయంపేట 9వ వార్డు పరిధిలో స్థానిక కౌన్సిలర్ దేవుని జయరాజుకు చెందిన మినరల్ వాటర్ ప్లాంట్ వద్ద ఈ కమలాలు వికసించి కనువిందు చేశాయి. బ్రహ్మకమలం శివుడికి అత్యంత ప్రీతికరమైంది. హిమాలయాల్లో దొరికే ఈ మొక్క ఇంట్లో ఉంటే మంచిదని భావిస్తుంటారు. అందులో భాగంగా రామాయంపేటకు చెందిన […]
సారథి, పెద్దశంకరంపేట/రామాయంపేట: ఏరువాక గురువారం జోరుగా సాగింది. పౌర్ణమి సందర్భంగా రైతులు ఎడ్లబండ్లు, నాగళ్లను మువ్వలు, వివిధ అలంకరణలు చేసి పొలం బాటపట్టారు. పెద్దశంకరంపేట, రామాయంపేట మండలాల్లో రైతన్నలు ఉత్సాహంగా నిర్వహించారు. వ్యవసాయ పనులను ప్రారంభించడానికి ముందు భూమికి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ శుభదినాన రైతులు, అన్నదాతలకు సిరులపంట పండుతుందని విశ్వాసం. జ్యేష్ఠ శుద్ధపౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని పిలుస్తుంటారు. పండుగ రోజున ఎద్దులను కడిగి వాటి కొమ్ములకు అందమైన రంగులు పూసి, […]
సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని బూరుగుపల్లి, కొలపల్లి తదితర గ్రామాల్లో నర్సరీలను ఈజీఎస్ ఏపీవో సుధాకర్ శుక్రవారం పరిశీలించారు. నర్సరీల్లో మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలను నాటేందుకు ప్రతిఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సారథి, రామాయంపేట: ఈ వర్షాకాలంలో వరిపంటనే కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలు పత్తి, పప్పు దినుసులు, నూనెగింజలను సాగు చేయాలని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సూచించారు. గురువారం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో వానాకాలం పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ నీటితో అధిక దిగుబడిని ఇచ్చే ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు […]
సారథి, రామాయంపేట: నకిలీ సీడ్స్, ఫర్టిలైజర్ గానీ రైతులకు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసునమోదు చేసి జైలుకు పంపిస్తామని నిజాంపేట ఎస్సై ప్రకాష్ గౌడ్ ఫర్టిలైజర్ షాప్ దుకాణాల యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని పలు విత్తన, ఫర్టిలైజర్ షాపులను ఆయన తన సిబ్బందితో కలసి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ సీడ్స్ గురించి ఎలాంటి సమాచారం రైతుల దగ్గర ఉన్నా పోలీస్ సిబ్బంది, […]
మెదక్ ఆర్డీవో సాయిరాం సారథి, పెద్దశంకరంపేట: లారీల్లోని ధాన్యం లోడును వెంటనే ఖాళీచేయాలని మెదక్ ఆర్డీవో సాయిరాం ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించారు. ముందుగా స్థానిక పౌరసరఫరాల శాఖ గోదాంలోకి వెళ్లి చూశారు. నిర్ణీత వ్యవధిలోనే సరుకులను పంపిణీ చేయాలని సూచించారు. వచ్చేనెల బియ్యం డబుల్ కోటా వస్తుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని గోదాం ఇన్ చార్జ్ ప్రదీప్ కుమార్ కు […]