సామజిక సారథి, ములుగు: నియోజకవర్గంలోని కొత్తగూడ మండలంలోని మైలారం తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొడ రాములు, అదే విధంగా గాంధీ నగర్ కు చెందిన మల్లెల సమ్మక్క, భూక్యా రుక్మా ఇటీవలే మరణించగా ‘సోమవారం మృతుల కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క పరమర్శించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు సుంకర బోయిన మొగిలి, జడ్పీటీసీ పూల్సం పుష్పలత శ్రీనివాస్, […]
సామాజిక సారథి, ములుగు: జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, బస్తాలు, లారీల కొరత లేకుండా వర్షానికి తడవకుండా పట్టాలు అందుబాటులో ఉంచాలని రైతు సంఘం ములుగు జిల్లా కమిటీ అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అంతించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి గపూర్ మాట్లాడుతూ వరి కోతలు ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా, ఇప్పటివరకూ ధాన్యం కొనుగోలు చేయలేదని ఆరోపించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం […]
సామాజిక సారథి, ములుగు: ఎస్టీయూ ములుగు జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ ఆధ్వర్యంలో మోడల్ స్కూలు, బండారుపల్లి, జాకారం, మల్లంపల్లి, కోయగూడం, భూపాల్ నగర్ ప్రభుత్వ స్కూళ్లలో యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన టీచర్ల రేషనలైజేషన్ జీవోను పూర్తిగా వ్యతిరేకిస్తూ పాత జిల్లాల ప్రకారం పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూలు టీచర్లకు 010 ద్వారా వేతనాలు చెల్లించి హెల్త్ కార్డు […]
సారథి, వాజేడు: ములుగు జిల్లా మూరుమూరు పంచాయతీ గణపురంలో శనివారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యమున గ్రామంలో బాలింతలు గర్భిణులు, జ్వరంతో బాధపడుతున్నవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ యమున, సర్పంచ్, సెక్రటరీ, వైద్యసిబ్బంది కోటిరెడ్డి, ఛాయాదేవి, ఆశా కార్యకర్త, అంగన్ వాడీ టీచర్ పాల్గొన్నారు.
సారథి, వాజేడు: వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతూ వైద్యం అందక బాలుడు మృతిచెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పెనుగోలుకు చెందిన ఉయిక శేషయ్య, దివ్యభారతి(కాంతమ్మ) నాలుగో కుమారుడు రాకేష్(3) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం బాలుడిని మండలంలోని ప్రగళ్లపల్లిలో ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో వాజేడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా బాలుడు మరణించాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
సారథి, వాజేడు: ఎమ్మార్పీఎస్ 27వ ఆవిర్భావ దినోత్సవాన్ని ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు అరికెల వేణు మాదిగ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం అనునిత్యం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తూనే ఉన్నారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, వికలాంగుల పింఛన్ ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగానే ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని అన్నారు. దళితులను ఏడేళ్లుగా మోసం చేసిన […]
సారథి, ఏటూరునాగారం: ములుగు ఎమ్మెల్యే సీతక్క గొప్ప హృదయం చాటుకున్నారు. ఇటీవల మరణించిన కుటుంబాలను ఆదివారం పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన కైసర్ పాషా కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం చేశారు. అలాగే గరా రాములు కుటుంబానికి రూ.రెండువేల చొప్పున సాయం చేశారు. అలాగే కరోనాతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరుసవడ్ల వెంకన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆయూబ్ […]
సారథి ప్రతినిధి, ములుగు: ములుగు ఎమ్మెల్యే సీతక్క మరోసారి గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం గుర్రంపేటలో సుమారు 130 కుటుంబాలకు గురువారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లాక్ డౌన్ వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక్కపూట తిండికి కూడా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పేదల ఆకలి తీర్చడం కోసం కనీసం ముఖ్యమంత్రి ఆలోచించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రతినెలా ప్రతి పేద కుటుంబానికి రూ.ఆరువేల […]