వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దకొడుకు జూనిర్ ట్రంప్ గర్ల్‌ఫ్రెండ్ కింబర్లీ గుయిల్ ఫాయల్కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. అమెరికా మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ట్రంప్ ప్రచార టీమ్ సీనియర్ ఫండ్ రైజర్‌గా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ దగ్గర పనిచేసే వారిలో వైరస్ బారినపడిన మొదటి వ్యక్తి ఈమె. ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవని, అయినా పాజిటివ్ వచ్చిందని వైట్‌హౌస్ వర్గాలు చెప్పాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి దక్షిణ డకోటాలో […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. రోజుకు దాదాపు 20వేలకు పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక్కరోజులోనే 22,771 కేసులు నమోదైనట్లు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ శనివారం హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది. దీంతో కేసుల సంఖ్య 6,48,315కు చేరింది. ఒక్క రోజులో 442 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 3,94,227 మంది కోలుకోగా.. 2,35,433 యాక్టివ్ కేసులు ఉన్నాయి. శుక్రవారం ఒక్కరోజే 14వేల మంది కోలుకున్నారని అధికారులు చెప్పారు. మన దేశంలో రికవరీ […]
వాషింగ్టన్: భారత్‌లో చైనా యాప్‌లను నిషేధించడం సరియైన చర్యేనని అమెరికా సమర్థించింది. టిక్‌టాక్, షేర్ఇట్ సహా మొత్తం 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పందించారు. సమగ్రత, జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని భారత్‌లో కొన్ని హానికరమైన యాప్‌లను నిషేధించడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.కాగా ప్రధాని నరేంద్ర మోదీ చైనా సోషల్ మీడియా బ్లాగింగ్ సైట్ వీబో నుంచి వైదొలిగారు. చైనా యాప్‌లను […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రపంచం మొత్తం కరోనా ధాటికి విలవిల్లాడుతోంది.. మహమ్మారి నానాటికీ విజృంభిస్తోంది. వాళ్లు.. వీళ్లు అనే తేడా లేకుండా జనం పిట్టల్లా రాలిపోతున్నారు. బాధితుల సంఖ్య రెట్టింపవుతోంది. అడ్డుకోవడం ఏ దేశం తరం కావడం లేదు. కొన్ని దేశాల్లో ప్రభుత్వాలే చేతులెత్తేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు కోటికి పైగా నమోదయ్యాయన్న వార్త ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉండడంతో రెట్టింపు స్థాయిలో కేసులు […]
వాషింగ్టన్: ఇండియా – చైనా బోర్డర్లో నెలకొన్న పరిస్థితులపై అమెరికా మరోసారి స్పందించింది. చైనా నుంచి వస్తున్న ముప్పును ఎదుర్కొనేందుకు తమ సైన్యాన్ని మనకు మద్దతుగా పంపిస్తానని విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. జర్మనీలో ఉన్న అమెరికా బలగాలను ఇక్కడకు పంపుతున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు. జర్మనీలో బలగాలను ఎందుకు తగ్గిస్తున్నారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. భారత్, దక్షిణాసియాకు చైనా ముప్పుడా మారిందన్నారు. గురువారం బ్రసెల్స్ ఫోరం వర్చువల్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన పాంపియో ఈ […]
న్యూఢిల్లీ: అమెరికాలో ఇరుక్కుపోయిన మనవాళ్లను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియా నడుపుతున్న వందేభారత్ ఫ్లైట్లపై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికా ప్రభుత్వం ఇలాంటి ఫ్లైట్లు నడపకుండా ఇండియన్ గవర్నమెంట్ నిషేధం విధించిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది. ఇప్పటి నుంచి ఫ్లైట్లు నడపాలంటే కచ్చితంగా 30 రోజుల ముందే అప్లికేషన్ పెట్టుకోవాలని కొత్త నిబంధనలు ఇచ్చింది. మూడో విడత వందేభారత్ మిషన్ కింద అమెరికాలోని వివిధ ప్రదేశాల నుంచి ఇండియా ఈ […]
వాషింగ్టన్: ఇండియా – చైనా మధ్య గొడవలు మరింత సంక్లిష్టంగా మారాయని, రెండు దేశాలతో చర్చలు జరుపుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సమస్య చాలా పెద్దదే అని అన్నారు. అందుకే అమెరికా చర్చలు జరుపుతోందని, గొడవలు తీర్చేందుకు హెల్ప్ చేస్తామన్నారు. కరోనా వ్యాప్తి తర్వాత మొదటిసారి ఎలక్షన్ ప్రచారానికి బయలుదేరిన ట్రంప్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉందని, ఏం జరుగుతుందో […]
న్యూఢిల్లీ: డోప్ పరీక్షకు హాజరు కాకపోవడంతో.. వంద మీటర్ల ప్రపంచ చాంపియన్, అమెరికా స్టార్ స్ర్రింటర్ క్రిస్టియన్ కోల్‌మన్‌పై సస్పెన్షన్ వేటుపడింది. విచారణ పూర్తయ్యే వరకు అతను ఎలాంటి ఈవెంట్లలో బరిలోకి దిగకూడదని ప్రపంచ అథ్లెటిక్స్ ఇంటిగ్రేటి యూనిట్(ఏఐయూ) వెల్లడించింది. అయితే డిసెంబర్ 9న శాంపిల్స్ సేకరించే సిబ్బంది తన ఇంటికి వచ్చినా.. కనీసం ఫోన్ కూడా చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పాడు. ఆ సమయంలో తాను పక్కనే షాపింగ్ మాల్లో ఉన్నానని తెలిపాడు. ఎప్పుడు, […]