సారథిన్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో కరోనా విజృంభిస్తున్నది. కొత్తగా జిల్లాలో మరో ఏడు కరోనా కేసులు నమోదైనట్టు సమాచారం. సూర్యాపేట జిల్లాకేంద్రంలో జమ్మిగడ్డ, అలంకార్ రోడ్, గడ్డిపల్లి, దోసపహాడ్, తిరుమలగిరి, (మాలిపురం) ప్రాంతాలతోపాటు కోదాడ, హుజూర్ నగర్ లలోనూ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు.
మునగాల, సారథి న్యూస్ : మునగాల మండల కేంద్ర శివారులో ఉన్న హరిహరసుత అయ్యప్ప ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న హుండీని పగులగొట్టి భక్తులు స్వామి వారికి సమర్పించిన కానుకలను ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. గతంలో మూడు సార్లు ఈ విధంగానే చోరీకి పాల్పడినట్లు ఆలయ నిర్వాహకులు వాపోయారు
సారథి న్యూస్, మునగాల: క్రషర్ మిల్లులో రాత్రి వేళ నిర్వహిస్తున్న బ్లాసింగ్‌లు ఆపాలంటూ స్థానికులు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే..సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామ శివారులో ఉన్న క్రషర్ మిల్లులో యాజమాన్యం తరచూ రాత్రి వేళ పెద్ద ఎత్తన బ్లాస్టింగ్లు జరుపుతున్నారు. దీంతో స్థానిక ఎస్సీ కాలనీలో నివాసముంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం క్రషర్ మిల్లు యాజమాన్యం బ్లాసింగ్‌లు ఆపాలంటూ వారు రోడ్డుపై ధర్నాకు దిగారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. […]
సారథి న్యూస్, నడిగూడెం(సూర్యాపేట): సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ఒక మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా ఆమె తన సొంత ఇంట్లో హోం క్వారంటైన్లో ఉంటుంది. ఈ సందర్భంలో ఆమె నివాసముంటున్న వీధిలోని ప్రజలు శనివారం బాధితురాలిని అక్కడి నుంచి తరలించాలంటూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా ప్రాంతానికి చేరుకున్న అధికారులు, పోలీసులు ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయిస్తామని చెప్పినప్పటికీ స్థానికులు వినకపోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావారణం నెలకొంది. రోడ్డుపైనే […]
సారథి న్యూస్, యాదాద్రి: యాదాద్రి ఆంజనేయ, నరసింహ అరణ్యం అర్బన్ ఫారెస్ట్ పార్కులను దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, రాజ్యసభ్య సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. అరణ్యంలో కాలినడకన తిరుగుతూ సందర్శకుల కోసం ఏర్పాటుచేసిన సౌకర్యాలను పరిశీలించారు. అటవీశాఖ ప్రాంతాన్ని వ్యూ పాయింట్ నుంచి తిలకించారు. హరితహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు అడవులను కాపాడుకునేందుకు అత్యంత కఠినంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని వెల్లడించారు. సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆలోచనలకు అనుకూలంగా హైదరాబాద్ నలువైపులా ఇతర పట్టణాలకు […]
సారథి న్యూస్, హుస్నాబాద్: మున్సిపాలిటీలలో పని చేస్తున్న మెప్మా ఆర్పీలకు వేతనాలు చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మెప్మా ఆర్పీలకు సంవత్సరం నుంచి వేతనాలు అందించడం లేదని చెప్పారు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మంత్రి కేటీఆర్, మెప్మా డైరెక్టర్ వెంటనే స్పందించి బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
సారథి న్యూస్, నల్లగొండ: కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని, వారిని చూసి హేళనగా మాట్లాడకూడదని, చుట్టుపక్కల వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయొద్దని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాధ్ సూచించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఇంటి యజమానులు వేధిస్తున్నట్లు, ఇల్లు ఖాళీ చేయమని ఇబ్బందులు గురి చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. సరైన జాగ్రత్తలు, ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టడం ద్వారా రోగ నిరోధకశక్తి పెంచుకునే ఆహారాన్ని తీసుకోవడం […]
సారథి న్యూస్, నల్లగొండ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సరుకు రవాణా, అత్యవసర సేవల వాహనాలు మినహా మిగిలిన అన్ని ప్రైవేట్ వెహికిల్స్ల్లో ప్రయాణించే వారికి విధిగా పాస్ ఉండాలని, పాస్ లేకుండా ప్రయాణాన్ని అనుమతించబోమని నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాధ్ సూచించారు. ఆదివారం పలు ఆదేశాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వెళ్లాలనే ప్రయాణికులకు ఇకపై ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టంచేశారు. నల్లగొండ జిల్లా మీదుగా మాచర్లకు వెళ్లే […]