Breaking News

జాతీయం

38 లక్షలకు చేరువలో కేసులు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా మహమ్మారి అంతకంతకు విస్తరిస్తున్నది. గత 24 గంటల్లో 78,357 కొత్తకేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య సంఖ్య 37,69,524 కు చేరింది. తాజాగా 1,045 మందిని కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకున్నది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 66,333 కుచేరుకున్నది. ఇప్పటివరకు 29,01,909 మంది కొలుకున్నారని కేంద్రవైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 8,01,282 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బాధితుల రికవరీ రేటు 77.02 శాతంగా ఉందని తెలిపింది. అలాగే మరణాల […]

Read More

మావోయిస్ట్​ అగ్రనేత గణపతి.. లొంగుబాటు

సారథి న్యూస్​, హైదరాబాద్​: మావోయిస్ట్​ కీలకనేత గణపతి అలియాస్​ ముప్పాల లక్ష్మణరావు లొంగిపోనున్నట్టు సమాచారం. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలతో ఆయన చర్చించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 74 ఏళ్ల గణపతి కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడతున్నారు. నడవడానికి వ్యక్తిగత పనులు చేసుకునేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అజ్ఞాతంలో ఉండడం అసాధ్యమని భావించి ఆయన లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. ఆస్తమా, మోకాళ్లనొప్పి, డయాబెటిస్​తో గణపతి బాధపడుతున్నారు. ఆయనను అనుక్షణం ఇద్దరు సహాయకులుగా ఉంటున్నారట. […]

Read More

మారటోరియం మరో రెండేళ్లు

ఢిల్లీ: వివిధ రకాల రుణాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న మారటోరియాన్ని మరో రెండేండ్ల పాటు పొడగించాలని కేంద్రం యోచిస్తోంది. మారటోరియం సమయంలో వడ్డీ మాఫీపై చేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ అంశంపై మంగళవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన సోలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా మాట్లాడుతూ.. మరో రెండేండ్లపాటు మారటోరియం పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని చెప్పారు. అయితే మారటోరియం సమయంలో వడ్డీని మాత్రం […]

Read More

ప్రణబ్​ ముఖర్జీ కన్నుమూత

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ముఖర్జీ (84) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనాతో ఈ నెల 10న ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరినప్పటినుంచి ప్రణబ్​ ఆరోగ్యం విషమంగానే ఉన్నది. ఆయనకు ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్​ఫెక్షన్​ అయినట్టు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయనను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించామని చెప్పారు. ఆయన ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు. ప్రణబ్​ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్​ అధినేత్రి సోనియా, యువనేత […]

Read More

చిన్నారిపై గ్యాంగ్​రేప్​

త్రిపుర: ఓ వైపు కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో బాలికలు, చిన్నారులపై లైంగికదాడులు కొనసాగుతున్నాయి. తాజాగా త్రిపుర రాష్ట్రంలోని తబారియా జిల్లాలో ఎనిమిదేండ్ల చిన్నారుపై ఏడుగురు లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితులంతా మైనర్లే కావడం గమనార్హం. తబారియా జిల్లాకు చెందిన ఓ బాలిక స్థానికంగా మూడో తరగతి చదువుతున్నది. ఆమె ఇంటిపక్కల ఉండే ఎనిమిది మంది బాలురు.. చిన్నారిని ఆడకొనేందుకు పిలిచారు. తెలిసినవాళ్లే కావడంతో చిన్నారి వాళ్లతో వెళ్లింది. దీంతో బాలికను ఓ ఇంట్లోకి తీసుకెళ్లి ఏడుగురు లైంగకదాడికి […]

Read More

జరిమానా.. రూపాయి

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణకేసులో దోషిగా తేలిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​కు సుప్రీంకోర్టు రూ. 1 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రశాంత్​ భూషణ్​..​ గత జూన్ 27, 29 తేదీల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వివాదాస్పద ట్వీట్లు పెట్టారు. ఈ ట్వీట్లను ఎస్ఎ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. ఆయనపై ‘ధిక్కార మరియు పరువు నష్టం’ కేసులు నమోదు చేసి విచారించింది. ఈ కేసుపై విచారించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్​లో ఉంచింది. సోమవారం తీర్పును వెలువరించింది.

Read More

కంగనాకు డ్రగ్​మాఫియాతో ప్రాణహాని!

బాలీవుడ్​ డ్రగ్​మాఫియాపై సంచలన ఆరోపణలు చేసిన కంగనా రనౌత్​కు ప్రాణహాని ఉందని ఆమెకు వెంటనే భద్రత కల్పించాలని బీజేపీ డిమాండ్​ చేసింది. బాలీవుడ్​కు డ్రగ్​ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని.. ఆ విషయం తాను నిరూపిస్తానని కంగనా ఇటీవల ట్వీట్​ చేసింది. ఈ ట్వీట్​ అనంతరం ఆమెకు బెదిరింపులు వచ్చాయి. దీంతో బీజేపీ స్పందించింది. కంగన రనౌత్​కు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్​ థాక్రే వెంటనే భద్రత కల్పించాలని.. బాలీవుడ్​కు డ్రగ్​ మాఫియా ఉన్న సంబంధాలపై విచారణ చేపట్టాలని బీజేపీ […]

Read More

రియా జవాబులకు సీబీఐ షాక్​!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కేసులో రియాచక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తుంది. కాగా రియాచక్రవర్తిని సీబీఐ అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు రియా తడబడ్డట్టు సమాచారం. రియా చెబుతున్న సమాధానాలతో సీబీఐ అధికారులే షాక్​కు గురవుతున్నారట. అక్కడ ఆమె ప్రతి ప్రశ్నకు నాకేం తెలియదు అని సమాధానం చెబుతుండటంతో ఆమె నటనకు షాక్​ అవుతున్నారట. ముఖ్యమైన ప్రశ్నలన్నింటికి ఆమె […]

Read More