Breaking News

జాతీయం

ప్రభుత్వాలు, ఎన్‌జీవోలకు సోనూసూద్​రిక్వెస్ట్​

ప్రభుత్వాలు, ఎన్‌జీవోలకు సోనూసూద్ ​రిక్వెస్ట్​

కరోనా కష్టకాలంలో రియల్ హీరో అనిపించుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్న సినీనటుడు సోనూసూద్ దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. పల్లె, పట్నం అనే తేడాలేకుండా మహమ్మారి వైరస్ వీరవిహారం చేస్తోంది. ఎంతోమంది కరోనా కాటుకు బలవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు సోనూసూద్‌ ఓ విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిలబడాలని కోరారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో […]

Read More
అత్యంత విలువైన బీమా సంస్థగా ఎల్ఐసీ

అత్యంత విలువైన బీమా సంస్థగా ఎల్ఐసీ

సారథి, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ప్రపంచంలోనే బలమైన మూడో బీమా సంస్థ, పదో అత్యంత విలువైన బీమా బ్రాండ్‌గా నిలిచింది. లండన్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ వెలువరించిన ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని టాప్-100 అత్యంత విలువైన బీమా బ్రాండ్ల మొత్తం విలువ 2020లో రూ. 34.2 లక్షల కోట్ల నుంచి 6 శాతం తగ్గి 2021లో రూ. 32 లక్షల కోట్లకు చేరుకుంది. ‘ఈ ఏడాది […]

Read More
దలైలామా గొప్ప మనస్సు

దలైలామా గొప్ప మనస్సు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు భారత్‌కు అండగా నిలుస్తున్నారు. తాజాగా టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా పీఎం కేర్స్‌కు విరాళం ప్రకటించారు. భారత్‌తో పాటు ప్రపంచదేశాలు కొవిడ్ పై పోరాడుతున్న తీరును తాను గమనిస్తూనే ఉన్నానని, ఈ క్రమంలో వస్తున్న వార్తలపై ఆందోళన చెందుతున్నట్టు ఆయన తెలిపారు. ‘భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారి సవాలును ఎదుర్కొంటున్నాయి. కొవిడ్-19 కేసులు అంతకంతకూ పెరుగుతున్న ఈ క్లిష్ట పరిస్థితులలో తోటి […]

Read More
హమ్మయ్య.. ఆక్సిజన్​బండి వచ్చేసింది!

హమ్మయ్య.. ఆక్సిజన్ ​బండి వచ్చేసింది!

సారథి, హైదరాబాద్: కరోనా సెకండ్​వేవ్​విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆక్సిజన్​అందక వందల సంఖ్యలో రోగులు చనిపోతున్న విషయం తెలిసిందే. అయితే మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను వినియోగిస్తున్నారు. అయినా సరిపోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేటాయిస్తానని చెప్పింది. అందులో 70 టన్నుల వరకు సమకూరింది. మిగితా ఆక్సిజన్ ను బళ్లారి, బిలాయ్, అంగుల్ (ఒడిశా) పెరంబదూర్ […]

Read More
సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం

సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం

న్యూఢిల్లీ : సీపీఎం జనరల్ సెక్రటరీ, సీనియర్​ నేత సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి (35) కరోనాతో కన్నుమూశాడు. గురువారం ఉదయం 5.30 గంటలకు ఆయన గురుగ్రావ్ లోని మేదాంత ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. రెండు వారాలుగా ఆశిష్ అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ఈరోజు ఉదయం నా పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరిని కోల్పోయానని తెలియజేయడం నాకు చాలా […]

Read More
శ్మశానాల్లో శవాల గుట్టలు

శ్మశానాల్లో శవాల గుట్టలు

కరోనా రోగుల అంత్యక్రియల కోసం బంధువుల ఎదురుచూపులు వారణాసి, భోపాల్, ఇండోర్, ఘజియాబాద్‌, రాంచీల్లో కిక్కిరిసిన శ్మశానాలు న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మృత్యువిలయాన్ని సృష్టిస్తోంది. తొలిసారి లక్ష కేసులను దాటి పదిరోజుల్లోనే రెండో లక్షను అధిగమించిన మహమ్మారి ఇప్పుడు మృత్యుపంజా విసురుతోంది. ఒకవైపు కరోనా పేషెంట్లతో అంబులెన్సులు హాస్పిటళ్ల ముందు లైన్​ కడుతున్నాయి. మరోవైపు శ్మశానవాటికల ముందు శవాల లైన్‌లు దర్శనమిస్తున్నాయి. కరోనా సెకండ్​ వేవ్​ నేపథ్యంలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, వారణాసి, లక్నోతో […]

Read More
ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఛత్తీస్‌గఢ్‌ చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

సారథి, ఖమ్మం: కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక హెలిక్యాప్టర్​లో జగదల్‌పూర్‌కు చేరుకున్న ఆయన సైనికులకు నివాళులర్పించారు. ఛత్తీస్‌గఢ్​లోని బీజాపూర్ జిల్లా తెర్రం అటవీ ప్రాంతంలో వోయిస్టుల భీకర దాడిలో సుమారు 22 మంది జవాన్లు నేలకొరిగిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి రాయపూర్, బీజాపూర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించనున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా జగదల్‌పూర్‌ పర్యటన […]

Read More
5 రాష్ట్రాల్లో ఎన్నికల సంగ్రామం

5 రాష్ట్రాల్లో ఎన్నికల సంగ్రామం

న్యూఢిల్లీ: మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సంగ్రామం మొదలైంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. అస్సాం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా శుక్రవారం వెలువరించారు. కేరళలో 140, అస్సాం 126, తమిళనాడు 234, పశ్చిమబెంగాల్‌ 294, పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే […]

Read More