Breaking News

క్రీడలు

For more details

ఐపీఎల్​ వచ్చేసింది

ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది

దుబాయ్ : క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-13 షెడ్యూల్ వచ్చేసింది. ఆదివారం బీసీసీఐ ఈ మెగాటోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈనెల 19 నుంచి మొదలవ్వబోయే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కు మధ్య జరగనుంది. అబుదాబి లోని షేక్ జాయేద్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభ వేడుకలు.. రాత్రి 7.30 కు మ్యాచ్ మొదలవనుంది. […]

Read More

ఆదివారం ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్​

న్యూఢిల్లీ : క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 13 వ సీజన్ ఐపీఎల్ షెడ్యూల్ ఈ నెల 6న(ఆదివారం) విడుదల కానుంది. ఈనెల 19 నుంచి నవంబర్​10 మధ్య జరగబోయే ఈ మెగాటోర్నీ దుబాయ్, అబుదాబి, షార్జాలో నిర్వహించనున్నారు. ఈ మేరకు టోర్నీ షెడ్యూల్ ను ఆదివారం విడుదల చేస్తామని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్ కు చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టాయి.

Read More

ఐపీఎల్ నుంచి భజ్జీ ఔట్

దుబాయ్: మరికొద్ది రోజుల్లో మొదలవనున్న ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ జట్టు సభ్యుడు, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం ఈ ఏడాది ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే సీఎస్​కే కీలక సభ్యుడు సురేష్ రైనా టోర్నీ నుంచి బయటకు రాగా.. ఇప్పుడు భజ్జీ కూడా నిష్క్రమించాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు సీఎస్​కే యాజమాన్యానికి టర్భోనేటర్ వివరించాడు.

Read More
చెస్​లో కొత్త రికార్డు

చెస్​లో సరికొత్త రికార్డు

తొలిసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. తొలిసారి స్వర్ణం సాధించి కొత్త రికార్డును లిఖించింది. ఈ మెగా టోర్నీలో రష్యాతో కలిసి భారత్‌ సంయుక్తంగా పసిడి గెలుచుకుంది. ఇది చెస్‌ ఒలింపియాడ్‌ చరిత్రలో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన. గతంలో వరల్డ్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో కాంస్యం గెలిచిన భారత్‌.. ఈసారి స్వర్ణాన్ని ఒడిసిపట్టింది. ఫలితంగా 93 ఏళ్ల చెస్‌ ఒలింపియాడ్‌ చరిత్రలో భారత్‌కు తొలిసారి స్వర్ణం వచ్చినట్లయింది. భారత్‌ పైనల్‌కు […]

Read More

అభిమానులకు కోహ్లీ​ గుడ్​న్యూస్​

టీంఇండియా కెప్టెన్​ విరాట్​కోహ్లీ, తన ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​ చెప్పారు. త్వరలోనే తాను తండ్రిని కాబోతున్నట్టు ట్విట్టర్​ లో వెల్లడించాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్​లో తన సతీమణి, ప్రముఖనటి అనూష్కశర్మతో ఉన్న ఓ ఫొటోను పంచుకున్నాడు. విరాట్​కు సోషల్​మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతోపాటు, బాలీవుడ్​ ప్రముఖలు విరుష్క దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.

Read More

సచిన్‌, ధోనీ, కోహ్లీ.. ఇప్పుడు రోహిత్‌

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా పరుగులు వీరుడు రోహిత్‌శర్మ మరో ఘనత సాధించాడు. ప్రతిష్ఠాత్మక రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికైన నాలుగో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మాజీ క్రికెటర్‌‌ వీరేంద్ర సెహ్వాగ్‌, హాకీ దిగ్గజం సర్ధార్‌ సింగ్‌తో కూడిన 12 మంది సభ్యుల బృందం హిట్‌మ్యాన్‌ సహా మరో ముగ్గురి పేర్లను ఖేల్‌రత్నకు ప్రతిపాదించింది. రెజ్లర్‌ వినీశ్‌ ఫొగాట్‌, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మనికా బాత్రా, దివ్యాంగ హైజంపర్‌ మరియప్పన్‌ తంగవేలు పేర్లను కమిటీ ప్రభుత్వానికి సిఫార్సుచేసింది. కమిటీ […]

Read More
మాజీ ఓపెనర్​ చేతన్ చౌహాన్‌ కన్నుమూత

మాజీ ఓపెనర్​ చేతన్ చౌహాన్‌ కన్నుమూత

ఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్‌ చేతన్‌ చౌహాన్ (73)‌ కరోనాతో పోరాడుతూ ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని అతని సోదరుడు పుష్పేంద్ర చౌహాన్ మీడియాకు వెల్లడించారు. జులై 12న కరోనా వైరస్‌ బారిన పడడంతో అతని మొదట లఖ్‌నౌవూలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. ఆరోగ్యం మరింత క్షీణిస్తుండడంతో గురుగ్రామ్‌లోని మరో ఆస్పత్రికి తరలించారు. అతని కిడ్నీతో సహా కొన్ని అవయవాలు పాడవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో అతణ్ని వెంటిలేటర్‌పై ఉంచారు. ఈ క్రమంలో చేతన్‌ చౌహాన్‌ […]

Read More
క్రికెట్​కు రైనా గుడ్‌బై

క్రికెట్​కు రైనా గుడ్‌ బై

ఢిల్లీ: టీమిండియా స్టార్​ క్రికెటర్‌ సురేశ్‌ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ ప్రకటించిన కాసేపటికే రైనా కూడా రిటైర్మెంట్‌ ప్రకటించడం గమనార్హం.

Read More