Breaking News

వర్గీకరణ చేసి చట్టబద్దత కల్పించాలి

ఏమ్మార్పిస్ డిమాండ్

సామాజిక సారథి, మహాబూ నగర్ బ్యూరో :

గత 28ఏళ్ళు గా వర్గీకరణ కోసం ఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో మాదిగ లు గల్లీ నుంచి డిల్లీ వరకు పోరాటాలు చేస్తున్నదని బిజెపి వర్గీకరణ ను బలపరుస్తూ తీర్మాణం చేసిందని దాన్ని వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పి ఎస్ ఆందోళన చేట్టారు.బిజెపి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో రాష్టం కార్యవర్గ సమావేశం లో ఆపార్టీ నేతలకుమంగళవారం వినతిపత్రం ఇచ్చేందుకు ఆందోళన చేపట్టారు. కేంద్రం లో బిజెపి ప్రభుత్వం ఉందని వర్గీకరణ విషయం లో ఎందుకు పట్టించుకోవడం లేదని ఎమ్మార్పిస్ రాష్ట అధ్యక్షుడు గోవింద నరేష్ మాదిగ,జాతీయ అధ్యక్షుడు బొర్ర బిక్షపతి మాదిగ, జాతీయ అధికార ప్రతి నిది కోళ్ల శివ మాదిగ,నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దశరథం,ఎం ఎస్ ఎఫ్ రాష్ట అధ్యక్షుడు మీసాల కార్తీక్ మాదిగ ఆందోళన, నిరసన చేపట్టారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుఎమ్మార్పిఎస్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వివరించాలని డిమాండ్ చేశారు.వర్గీకరణకు మద్దతుగా అంటూనే మోసం చేయడం త గదని వారు హెచ్చరించారు. బిజెపి వర్గీకరణ చేపట్టి మాదిగలకు భరోసా కల్పించాలని కోరారు. ఇప్పటికే అనేక విధాలుగా నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో ఎం ఎస్ ఎఫ్ నాయకులు, ఎమ్మార్పిఎస్ నాయకులు పాల్గొన్నారు.