సామాజిక సారథి, మహబూబాబాద్: తక్కలపల్లి రవీందర్ రావుకు ఎమ్మెల్సీ పదవి రావడంతో ఆయన అనుచరులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం అనుచరుడు పుచ్చకాయల రామకృష్ణ మాట్లాడుతూ మానుకోట ముద్దుబిడ్డ, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు రవీందర్ రావు ఎమ్మెల్సీ పదవి రావడం సంతోషకరమన్నారు. రవీందర్ రావుకు ఎమ్మెల్సీ పదవొస్తే అనంతాద్రి వెంకటేశ్వర స్వామి వారికి 101కొబ్బరి కాయలతో మొక్కు చెల్లించుకుంటామని మొక్కినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ వచ్చిన సందర్భంగా 101 కొబ్బరికాయలు కొట్టి, మొక్కులు చెల్లించినట్లు ఆయన పేర్కొన్నారు. […]
సామాజిక సారథి, ములుగు: జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, బస్తాలు, లారీల కొరత లేకుండా వర్షానికి తడవకుండా పట్టాలు అందుబాటులో ఉంచాలని రైతు సంఘం ములుగు జిల్లా కమిటీ అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అంతించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి గపూర్ మాట్లాడుతూ వరి కోతలు ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా, ఇప్పటివరకూ ధాన్యం కొనుగోలు చేయలేదని ఆరోపించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం […]
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయకుండా బీజేపీ, కేంద్రాన్ని ప్రశ్నించకుండా కాంగ్రెస్ రైతులను మోసం చేస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తీవ్రంగా విమర్శించారు. బుధవారం ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాంబారి సమ్మరావు తో కలిసి మంత్రి హన్మకొండలోని తన […]
సామాజిక సారథి, రాయపర్తి/వరంగల్: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో వానాకాలం సీజన్ లో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసి డబ్బు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యాపారి గొలుసుల కుమార్ ను బుధవారం రాయపర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. కాట్రపల్లి గ్రామంలో రైతుల పంటను కొనుగోలు చేసి కొంతమంది రైతులకు డబ్బు ఇవ్వకుండా రైతులను మోసం చేసినట్లు రైతుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు […]
సామాజిక సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీలో అభి హెల్ప్‌లైన్ ఎడ్యుకేషన్ సొసైటీ వారి సహకారంతో కొనసాగుతున్న అక్షర భారత్ విద్యాకార్యక్రమాన్ని మండల కోఆర్డినేటర్ కార్తీక్, గ్రామ కోఆర్డినేటర్ పాయం అజయ్ ఆదివారం ప్రారంభించారు. వయోజనులందరికీ విద్యను అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్నాగలక్ష్మి, ఆశా కార్యకర్త సమ్మక్క, గ్రామస్తులు పాల్గొన్నారు.
సామాజిక సారథి, వాజేడు: దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడికి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఆర్థిక సహాయం అందజేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం అరుణాచలపురం గ్రామానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్ రెండేళ్లుగా ఎర్రరక్తకణాలకు సంబంధించి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యచికిత్సల కోసం రెండెకరాల భూమిని కూడా అమ్ముకున్నాడు. మూడు రోజుల క్రితం వరంగల్ లోని లలిత ఆర్థోపెడిక్ ఆస్పత్రికి వైద్యం కోసం వెళ్లాడు. బిల్లు కట్టలేని పరిస్థితుల్లో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థను సంప్రదించాడు. స్పందించిన […]
సామాజిక సారథి, ములుగు: ఎస్టీయూ ములుగు జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ ఆధ్వర్యంలో మోడల్ స్కూలు, బండారుపల్లి, జాకారం, మల్లంపల్లి, కోయగూడం, భూపాల్ నగర్ ప్రభుత్వ స్కూళ్లలో యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన టీచర్ల రేషనలైజేషన్ జీవోను పూర్తిగా వ్యతిరేకిస్తూ పాత జిల్లాల ప్రకారం పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూలు టీచర్లకు 010 ద్వారా వేతనాలు చెల్లించి హెల్త్ కార్డు […]
సారథి, పరకాల: వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగెం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 122 మంది లబ్ధిదారులకు రూ.1.22 కోట్ల విలువైన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హన్మకొండలోని తన నివాసంలో బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.1,00,116 అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనని కొనియాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మహిళల ఆత్మగౌరవాన్ని పెంచిన మహానుభావుడని […]