Breaking News

వరంగల్

సామాజిక సేవకు గుర్తింపు

సామాజిక సేవకు గుర్తింపు

సారథి న్యూస్, ములుగు: తరచూ సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండే ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ కు అరుదైన గుర్తింపు దక్కింది. హైదరాబాద్​కు చెందిన ఇంద్రోజిర రమేష్ అనే యువకుడు మంగళవారం ఆమె ఫొటోలతో కూడిన జ్ఞాపికను అందజేశాడు. తస్లీమా రైతు ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు సెలవు రోజుల్లోనూ వ్యవసాయ పనులు చేస్తూ.. నిరుపేదలకు చేయూతనందిస్తూ.. అనాథలు, అభాగ్యుల ఆకలి తీరుస్తుంటారు. ఈ విషయాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న […]

Read More
ఏజెన్సీలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలి

ఏజెన్సీలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలి

సారథి న్యూస్, నూగూరు, వెంకటాపురం: ఏజెన్సీ ప్రాంతంలోకి గిరిజనేతరుల వలసలను నిరోధించాలని ఆదివాసీ నవనిర్మాణ సేన (ఏఎన్ఎస్) ములుగు జిల్లా అధ్యక్షుడు ఎట్టి విద్యాసాగర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఏఎన్ఎస్ మండలాధ్యక్షుడు పోలేబోయిన భార్గవ్ అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకటాపురం, వాజేడు మండలంలో ఇసుక, గ్రావెల్ దందా అధికారుల అండదండలతో జరుగుతోందన్నారు. ఆదివాసీలు రాజకీయ పార్టీల కుట్రలను పసిగట్టాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాన్ని విభజించి ఆదివాసీల ఐక్యతను దెబ్బతీశారని, ఏజెన్సీ ప్రాంతాన్ని అంతా […]

Read More
పోలీస్, రెవెన్యూ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్​

పోలీస్, రెవెన్యూ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్​

సారథి న్యూస్, వాజేడు: వాజేడు, పేరూర్ ​పోలీసు, రెవెన్యూ అధికారులు శనివారం కరోనా వ్యాక్సిన్​ వేసుకున్నారు. వాజేడు ఎస్సై తిరుపతిరావు, పేరూరు ఎస్సై హరికృష్ణ .. ఇలా 37 మంది టీకా తీసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మహేంద్ర, సీహెచ్ వో సూర్యప్రకాశ్​రావు, హెల్త్ పర్యవేక్షకుడు కోటిరెడ్డి, ఏఎన్ఎం నాగేంద్రకుమారి, లలిత, కన్యాకుమారి, చిన్న వెంకటేశ్వర్లు, కృష్ణ, లఖన్, అంగన్​వాడీ టీచర్లు శారద, విజయ పాల్గొన్నారు.

Read More
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బర్తరఫ్​చేయాలి

ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని బర్తరఫ్​ చేయాలి

సారథి న్యూస్, వాజేడు: ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆఫీసర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని బర్తరఫ్​ చేయాలని ఎమ్మార్పీఎస్ వాజేడు మండల ఇన్​చార్జ్ వావిలాల స్వామివారి గవర్నర్​ను కోరారు. ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు అరికిల్ల వేణుమాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారతర్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కులాలను బట్టి సమర్థులు, అసమర్థులుగా […]

Read More
సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ

సారథి న్యూస్, పస్రా: ములుగు జిల్లా పస్రా గ్రామంలో బుధవారం గండికోట నవీన్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద రూ.14వేల చెక్కును టీఆర్​ఎస్​ మండలాధ్యక్షుడు మురహరి భిక్షపతి అందజేశారు. ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి, గ్రామాధ్యక్షుడు చందర్ రాజు, ఎంపీటీసీ వెలిశాల స్వరూప, వార్డు సభ్యులు శ్యాం, పున్నం చందర్, రాజశేఖర్, గజ్జి మల్లికార్జున్, పట్టపు వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

Read More
సంఘ విద్రోహశక్తులకు సహకరించొద్దు

సంఘ విద్రోహశక్తులకు సహకరించొద్దు

సారథి న్యూస్, తాడ్వాయి: సంఘవిద్రోహ శక్తులు, వివిధ నిషేధిత విప్లవ పార్టీ గ్రూపులకు సహకరించవద్దని తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు సూచించారు. మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని లింగాల గ్రామ పంచాయతీ పరిధిలోని రాపట్ల గుత్తికోయగూడెంలో పోలీసు బలగాలతో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిఇంటిని క్షుణ్ణంగా తనిఖీచేశారు. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా? లేదా? అనే కోణంలో సోదాలు జరిపారు. అనంతరం గొత్తికోయ ఆదివాసీలందరిని ఒకచోట సమావేశపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక […]

Read More
చర్లలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి

చర్లలో గిరిజన వర్సిటీని ఏర్పాటు చేయాలి

సారథి న్యూస్, వాజేడు, వెంకటాపురం: గిరిజన విశ్వవిద్యాలయాన్ని చర్లలోనే ఏర్పాటుచేయడం ద్వారానే ఐదు రాష్ట్రాల ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్శా నర్సింహామూర్తి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసం.నాగరాజు అభిప్రాయపడ్డారు. మైదాన ప్రాంతమైన ములుగులో ఏర్పాటుచేయడం సరికాదన్నారు. శనివారం వారు చర్లలో విలేకరులతో మాట్లాడారు. చర్లలో ఏర్పాటుచేస్తే ఛత్తీస్ ఘడ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాల ఆదివాసీలకు అత్యంత అనువుగా ఉంటుందన్నారు. అంతేకాకుండా స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఆదివాసీలను ఉన్నతవిద్యకు […]

Read More
గాంధీజీ ఘననివాళి

గాంధీజీకి ఘననివాళి

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కలెక్టరేట్​లో శనివారం జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్ లోని అధికారులు, సిబ్బంది రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో డీఆర్వో రమాదేవి, డీసీవో విజయ్ భాస్కర్ రెడ్డి, ములుగు తహసీల్దార్ ఎం.సత్యనారాయణస్వామి, కలెక్టరేట్ ఏవో జె.శ్యాంకుమార్ పాల్గొన్నారు. వాజేడులో గాంధీజీ వర్ధంతివాజేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆఫీసుల్లో శనివారం గాంధీజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా […]

Read More