Breaking News

తెలంగాణ

టెట్​షెడ్యూల్ రిలీజ్

telangana.. టెట్​ షెడ్యూల్ రిలీజ్

సామాజికసారథి, హైదరాబాద్: టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. బుధవారం 30వేల ఉద్యోగాలకు ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. గురువారం టెట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టనుంది. ఏప్రిల్ 12ను దరఖాస్తులకు చివరితేదీగా గడువు విధించింది. జూన్ 12న పరీక్ష నిర్వహించనుంది.

Read More
పత్తికి రికార్డు రేటు

పత్తికి రికార్డు రేటు

:: జితేందర్​రెడ్డి,సామాజిక సారథి, వరంగల్ ​ప్రతినిధిసెల్​నం: 90005 66615 వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెల్లబంగారం రికార్డు ధర పలికింది. ఏకంగా క్వింటాలుకు రూ.10వేలు దాటి ఆల్ టైం రికార్డు స్థాయికి చేరింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఎప్పుడూ లేనంతగా క్వింటాలుకు రూ.10,100కు అమ్ముడుపోయింది. మంచి లాభసాటి ధర రావడంతో పత్తి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పత్తి ధర ఆల్ టైమ్ గరిష్టానికి చేరి క్వింటాలుకు […]

Read More

వైద్యరంగంలో తెలంగాణ అగ్రగామి

వనపర్తిలో 180 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఏడేళ్లలో 65 నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు పెంచాం వైద్య ఆరోగ్యశాఖా మంత్రి హరీశ్ రావు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిరంజన్​రెడ్డి సామాజిక సారథి, వనపర్తి : వైద్యరంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్టాన్న్రి నిలపడమే లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో 180 పడకల మాతాశిశు ఆరోగ్య కేంద్రం, 20 పడకలతో నిర్మించిన నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. […]

Read More
మోడీ కొత్త నాటకాలు

మోడీ కొత్త నాటకాలు

  • January 9, 2022
  • Comments Off on మోడీ కొత్త నాటకాలు

అధికార పార్టీల తీరు బీజేపీకి కలసివస్తోంది సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సామాజిక సారథి, తిరుపతి: పంజాబ్‌ రైతుల నిరసనపై ప్రధాని మోడీ కొత్త నాటకానికి తెరతీశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంజాబ్ లో తనను హత్య చేసేందుకు ప్రయత్నం జరిగిందని నరేంద్ర మోడీ సానుభూతి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని, నటనలో నేచురల్‌ స్టార్‌ని మించిపోయారని ఎద్దేవా చేశారు. పంజాబ్‌లో రైతులు ఆగ్రహంతో ఉండి అడ్డుకునే ప్రయత్నం […]

Read More
ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు చాన్స్

తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లించేందుకు మరో చాన్స్​

సామాజికసారథి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌కు సంబంధించిన పరీక్షల ఫీజుల చెల్లింపు తేదీలను ఇంటర్‌ మీడియట్​బోర్డు ఖరారు చేసింది. బుధవారం నుంచి ఈ నెల 24 వరకు చెల్లించవచ్చని తెలిపింది. నిర్ణీత సమయంలో ఫీజు చెల్లించనివారు.. లేటు ఫీజుతో ఫిబ్రవరి 21వ తేదీ వరకు చెల్లించవచ్చని బోర్డు కార్యదర్శి జలీల్‌ ప్రకటించారు. లేటు ఫీజు రూ.100తో ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 1 నుంచి 7 […]

Read More
సిమెంట్‌ ధరలకు రెక్కలు

సిమెంట్‌ ధరలకు రెక్కలు

ఏపీ, తెలంగాణలో ధరలు పెంచిన డీలర్లు సామాజిక సారథి, హైదరాబాద్‌ : ఇప్పటికే నిత్యావసరల ధరలు, కూరగాయల ధరలు, పెట్రోల్‌ ధరలు, గ్యాస్‌ ధరల పెంపుతో అల్లాడిపోతున్న సామాన్యులకు మరో షాక్‌ తగిలింది. ఏపీ, తెలంగాణలో సిమెంట్‌ బస్తాల ధరలు పెరిగాయి. 50 కిలోల బస్తాపై ధరను రూ.20 –30 మేర పెంచుతున్నట్లు డీలర్లు పేర్కొన్నారు. డిమాండ్‌ పెరిగే అవకాశం ఉండటంతో వీటి ధర పెంచినట్లు చెప్పారు. ధరల పెంపుతో సిమెంట్‌ బస్తా ధర రూ.300–350 మధ్యలో […]

Read More
టీఎస్ ఆర్టీసీ న్యూ ఇయర్ గిఫ్ట్

టీఎస్ ఆర్టీసీ న్యూ ఇయర్ గిఫ్ట్

  • December 31, 2021
  • Comments Off on టీఎస్ ఆర్టీసీ న్యూ ఇయర్ గిఫ్ట్

ఎండీ సజ్జన్నార్ కీలక నిర్ణయం సామాజికసారథి, హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ ఎండీగా డైనమిక్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీలో కీలక మార్పులు చేస్తున్నారు. ప్రయాణికులను ఆకర్షించి ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకెళ్లేందుకు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సంస్థలో చాలా మార్పులతోపాటు ఆదాయం భారీగా పెరిగింది. అయితే, న్యూ ఇయర్‌లోకి అడుగిడుతున్న వేళ సజ్జనార్ మరో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 రోజున బస్సులో ప్రయాణించే 12 ఏళ్ల […]

Read More
థర్‌ వేవ్‌ వచ్చినట్లే!

థర్‌ వేవ్‌ వచ్చినట్లే!

వేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వచ్చే రెండు వారాలు అత్యంత కీలకం మాస్క్‌ మన జేబులో ఉండాల్సిందే హెల్త్​ డైరెక్టర్‌ శ్రీనివాసరావు సామాజికసారథి, హైదరాబాద్‌: ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకు ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రారంభమైందని అనుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. […]

Read More