Breaking News

జాతీయం

కాంగ్రెస్​ ఎమ్మెల్యేల అంత్యాక్షరి

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయాలు రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. సీఎం అశోక్​ గెహ్లాట్​ మాజీ డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సచిన్​ పైలట్​కు అనుకూలంగా ఉన్న 19 మంది ఎమ్మెల్యేలపై ఇప్పటికే కాంగ్రెస్​ అధిష్ఠానం వేటు వేసింది. మరోవైపు అశోక్​గెహ్లాట్​కు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్​ జైపూర్​లోని ఫెయిర్​మౌంట్​లో ఉంచింది. ఈ క్రమంలో ఆదివారం సరదాగా కొందరు ఎమ్మెల్యేలు అంత్యాక్షరి ఆడుతూ కనిపించారు. మరికొందరు తంబోలా ఆడుతూ, టీవీ చూస్తూ […]

Read More

సుశాంత్​ గర్ల్​ఫ్రెండ్​కు బెదిరింపులు

ఇటీవల ఆత్మహత్యకు చేసుకున్న సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ మాజీ ప్రేయసీ రియా చక్రవర్తిని కొందరు ఇన్​స్టాగ్రామ్​లో బెదిరించారు. ‘సుశాంత్​ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తులు నాకు అసభ్యకరంగా మెసేజ్​లు పెట్టారు. నన్ను రేప్​ చేస్తానని బెదిరిస్తూ ఒకడు మెసేజ్​ పంపించగా.. మరోకడు చంపేస్తానని బెదిరించాడు’ అంటూ రియా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సైబర్​క్రైం టీంతో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Read More
తమిళనాడులో బీజేపీ కొత్త ఎత్తులు

తమిళనాడులో బీజేపీ కొత్తఎత్తులు

చెన్నై: త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ కొత్త ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే గంధపు చెక్కల స్మగ్లర్​ వీరప్పన్​ కూతురు విద్యావీరప్పన్​కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు యువమోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆదివారం ఆమెను నియమించింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆమె గత ఫిబ్రవరిలో బీజేపీలో చేరారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో వీరప్పన్ వర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని […]

Read More

38 వేల కొత్తకేసులు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 38,902 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 10,77,618 కి చేరింది. ఒక్కరోజులో 38 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కొత్తగా 543 మంది వైరస్‌ బాధితులు మృతి చెందడటంతో మొత్తం మరణాల సంఖ్య 26,816 కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటి వరకు భారత్‌లోని మొత్తం కరోనా రోగుల్లో 6.77 లక్షల మంది కోలుకున్నారు. […]

Read More
మహారాష్ట్రలో పెరుగుతున్న కేసులు

మహారాష్ట్రలో 3 లక్షలు దాటిన కేసులు

ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. శనివారం రాత్రి వరకు రాష్ట్రంలో 3,00,937 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8,348 కొత్త కేసులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 11,596 మంది కరోనాతో మృతిచెందారు. కాగా లక్షా 65 వేల మంది వ్యాధినుంచి కోలుకున్నారు. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.

Read More
ట్విట్టర్‌‌కు కేంద్రం నోటీసులు

ట్విట్టర్‌‌కు కేంద్రం నోటీసులు

న్యూఢిల్లీ: మన దేశంలోని సైబర్‌‌ సెక్యూరిటీ నోడల్‌ కంప్యూటర్‌‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్‌‌టీ–ఇన్‌) ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విట్టర్‌‌కు నోటీసులు జారీచేసింది. ఇటీవల హై ప్రొఫైల్‌ ట్విట్టర్‌‌ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైన విషయంపై పూర్తి వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేసినట్లు ఏజెన్సీలోని ఒక అధికారి మీడియాతో చెప్పారు. హ్యాకర్లు పెట్టిన లింక్‌లను సందర్శించిన భారతీయ వినియోగదారుల సంఖ్య, వారికి కలిగిన నష్టం గురించి, ఆ అకౌంట్ల గురించి వారికి ఇన్ఫర్మేషన్‌ ఇచ్చారా లేదా […]

Read More
ఆ పని కాంగ్రెస్​దే: బీజేపీ

ఆ పని కాంగ్రెస్​దే: బీజేపీ

జైపూర్‌‌: రాజస్థాన్‌లోని రాజకీయ నాయకుల ఫోన్‌లను కాంగ్రెస్‌ ట్యాప్‌ చేస్తోందని బీజేపీ ఆరోపించింది. ఆడియో టేప్‌లు బయటికి రావడంపై సీబీఐ విచారణ జరిపించాలని కమలం పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. ‘ఫోన్‌ ట్యాపింగ్‌ చట్టపరమైన సమస్య కాదా? ఫోన్‌ ట్యాపింగ్‌కు నిర్దేశిత ప్రామాణిక విధానాలు ఉన్నాయా? రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై సీఎం అశోక్‌ గెహ్లాట్‌ సమాధానం చెప్పాలి’ అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా నిలదీశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఫోన్‌ […]

Read More
సీఎం చేస్తానని ప్రామిస్‌ చేస్తేనే..

సీఎం చేస్తానని ప్రామిస్‌ చేస్తేనే..

న్యూఢిల్లీ: పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించలేదంటూ సొంతపార్టీ కాంగ్రెస్‌ పైనే తిరుగుబాటు చేసిన రాజస్థాన్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలెట్‌ సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యేందుకు నిరాకరించారంట. తనను ఏడాదిలోపు సీఎం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారని, హామీ ఇచ్చే వరకు తాను భేటీ అయ్యేది లేదని తేల్చి చెప్పారని ప్రియాంకగాంధీకి సన్నిహితుల్లో ఒకరు చెప్పారు. తనను సీఎంను చేస్తానని పబ్లిక్‌గా అనౌన్స్‌ చేయాలని పైలెట్‌ కోరారని అన్నారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి […]

Read More