Breaking News

జాతీయం

అది ఫేక్‌న్యూస్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలోని అధికారిక బంగ్లా ఖాళీ చేసేందుకు తనకు మరో నెల టైమ్‌ ఇవ్వాలని ప్రధానిని కోరలేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. తాను రిక్వెస్ట్‌ చేసినట్లు వస్తున్న వార్తలు అన్నీ ఫేక్‌ అని చెప్పారు. ప్రియాంక గాంధీ ప్రస్తుతం ఉంటున్న.. ఢిల్లీలోని లూథియానా 35 లోధీ ఎస్టేట్‌ బంగ్లాను ఖాళీ చేయాలని గత నెలలో కేంద్ర హోం శాఖ ప్రియాంక గాంధీకి నోటీసులు ఇచ్చింది. అయితే బంగ్లా ఖాళీ చేసేందుకు మరో నెల […]

Read More

పెండ్లికి 20మందికే అనుమతి

భోపాల్​: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రదేశ్​ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో పెండ్లి వేడుకలకు కేవలం 20 మంది మాత్రమే హాజరకావాలని ఆదేశాలు జారీచేసింది. ఇంట్లో జరిగే పుట్టినరోజు తదితర వేడుకలకు 10 మంది మాత్రమే హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ ఆదేశాలను ఎవరు ఉల్లంఘించినా కఠినచర్యలు తీసుకుంటుమాని పేర్కొన్నది. రాష్ట్రంలో ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు చేయకూడదని.. బహిరంగ ప్రదేశాల్లో 5 కంటే ఎక్కువమంది ఓకే చోట గుమికూడదని పేర్కొన్నది. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుతతరుణంలో […]

Read More

పంజాబ్​ మంత్రికి కరోనా

చంఢీగర్​: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తున్నది. రాజకీయ, సినీప్రముఖులను వదలడం లేదు. ఎవరైతే నాకేంటి అన్నట్టుగా వైరస్​ విజృంభిస్తున్నది. తాజగా పంజాబ్​ మంత్రి రాజిందర్​ సింగ్​ బజ్వాకు కరోనా పాజిటివ్​గా నిర్ధరాణ అయ్యింది. ఆయన కార్యాలయంలోని కొందరికి కరోనా రావడంతో శనివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు కరోనా నెగిటివ్​గా వచ్చింది. అయినప్పటికి ఆయనకు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో మంగళవారం మరోసారి కరోనా పరీక్షచేయగా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. మంత్రికి పాజిటివ్​ రావడంతో ఆయన కుటుంబసభ్యుల […]

Read More

9 లక్షలు దాటిన కరోనా కేసులు

ఢిల్లీ: భారత్​లో కరోనా కేసులో సంఖ్య భయంకర స్థాయిలో పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో 29,429 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 9,36,181 కి చేరింది. ఈ కాగా ఒకే రోజు ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు కరోనాతో 24,309 మంది మృత్యువాత పడ్డారు. 5,92,031 మంది కోలుకున్నారు. వివిధ ఆసుపత్రుల్లో 3,19,840 మంది చికిత్స పొందుతున్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని.. వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చేవరకు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read More

రాజస్థాన్​లో ట్విస్టుల మీద ట్విస్టులు

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయం రసకందాయంలో పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఓ దశలో అధిష్ఠానం హామీతో సచిన్​ పైలట్​ మెత్తబడ్డాడని వార్తలు వినిపించాయి. అంతలోనే మళ్లీ కథ మొదటికొచ్చింది. తాను హైకమాండ్​తో మాట్లాడలేదని.. తనకు ఎవరూ ఎటువంటి హామీలు ఇయ్యలేదని ఆయనే స్వయంగా చెప్పారు. సోమవారం ఉదయం తనవర్గ ఎమ్మెల్యేలతో కూడిన ఓ వీడియోను సోషల్​మీడియాలో విడుదల చేశారు. తాజాగా జైపూర్​లోని ఫెయిర్​మోంట్​ హోటల్​లో జరిగిన కాంగ్రెస్​ శాసనాసభా […]

Read More

సారా అలీఖాన్​ డ్రైవర్​కు కరోనా

బాలీవుడ్​ స్టార్​హీరో సైఫ్​ అలీఖాన్​ కూతురు, నటి సారా అలీఖాన్​ డ్రైవర్​కు కరోనా సోకింది. దీంతో సైఫ్​అలీఖాన్​ కుటుంబసభ్యులు భయందోళనకు గురయ్యారు. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోగా వారందరికీ నెగెటివ్​ వచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని నేరుగా సారా ట్వట్టర్​ ద్వారా తెలియజేశారు. మరోవైపు ముంబైలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నది. రోజుకు వేలల్లో కొత్త కేసులు బయటపడుతున్నాయి. బాలీవుడ్​ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యలకు కరోనా వైరస్ సోకింది. ఈ […]

Read More

ఢిల్లీలో తగ్గుతున్న కేసులు

ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతున్నది. గత 24 గంటల్లో కేవలం 1,246 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గత 35 రోజుల్లో ఇంత తక్కువ కేసులు రావడం ఇదే ప్రథమం. కాగా ఇక్కడ కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నది. 91,312 మంది కరోనా చికిత్సపొంది కోలుకున్నారు. రికవరి రేటు 80.28 శాతం ఉన్నదని వైద్యశాఖ అధికారులు తెలిపారు. అధికంగా టెస్టులు చేయడం, పాజిటివ్​ రోగులకు మెరుగైన వైద్యం చేయడంతోనే కరోనా అదుపులో […]

Read More

9లక్షలు దాటాయి

ఢిల్లీ: భారత్​లో కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 9,06,752 కేసులు నమోదయ్యాయి. గత 20 రోజుల్లోనే కేసులు రెట్టింపయ్యాయని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రికవరీరేటు ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ కేసులు సంఖ్య పెరుగటం ఆందోళన కలిగిస్తున్నది. గత 24 గంటల్లో 28,000 కొత్తకేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 23,727 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 5,71,459 మందికి కరోనా రోగులకు వ్యాధి నయమైంది. కాగా 3,11,565 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు.

Read More