Breaking News

ఆదిలాబాద్

కలుషితమైన ఆహారం తిని..

22 మందికి అస్వస్థత ఇద్దరి పరిస్థితి విషమం సారథి న్యూస్, ఆదిలాబాద్: కలుషిత ఆహారం తిని 22 మంది అస్వస్థతకు గురైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శ్యాంనాయక్ తండాలో బుధవారం చోటుచేసుకుంది. ఏటా తండాలో దుర్గామాత పూజ నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా జరుపుకున్నారు. రాత్రి వండిన మటన్ ను సంప్రదాయం ప్రకారం పూజలో పాల్గొన్న వారు ప్రసాదంగా తీసుకుంటారు. ఎండకాలం కావడంతో మటన్​ కులుషితం కావడంతో 22 మంది అస్వస్థతకు […]

Read More

మే ఫుల్​ జీతం ఇవ్వండి

సారథి న్యూస్, ఆదిలాబాద్: మే నెల పూర్తిజీతం చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్​ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకట్​ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీఎస్ యూటీఎఫ్​ ఆఫీసు నల్లబ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారు. లాక్​ డౌన్​ పేరుతో టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతం ఇవ్వడం సరికాదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ధనిక రాష్ట్రమైన తెలంగాణలోనే ఉద్యోగుల వేతనాల్లో కోత అమలవుతోందని ఆక్షేపించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ రావు, జిల్లా […]

Read More

కూల్​ డ్రింక్స్​ పంపిణీ

సారథి న్యూస్, ఆదిలాబాద్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భుక్తాపూర్ నేతాజీ చౌక్ లో పారిశుధ్య కార్మికులకు, కూలీలకు శీతల పానీయాలు పంపిణీ చేశామని సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ బాల శంకర కృష్ణ తెలిపారు. గురువారం రాత్రి పోలీస్ గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు కలెక్టర్ చౌక్, వినాయక్ చౌక్, అంబేద్కర్ చౌక్, తెలంగాణ చౌక్, పంజాబ్ చౌక్ ప్రాంతాల్లో కూడా అందజేశామని వివరించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ […]

Read More

కూలీలకు పులిహోర పంపిణీ

సారథి న్యూస్, ఆదిలాబాద్ : రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్ఎ​టీయూ) ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు పెన్ గంగా సమీపంలో జిల్లా సరిహద్దు దాటి వెళుతున్న వలస కూలీలకు శుక్రవారం పులిహోర, నీటి ప్యాకెట్లు పంపిణీచేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జాదవ్ అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి. పి.నరేంద్ర, సంఘం రాష్ట్ర నాయకులు మెరుగు రాజు, మనోజ్, సంజీవరెడ్డి, భూపతి, మహేందర్ రెడ్డి, మనోహర్, అశోక్, రమేష్ పాల్గొన్నారు.

Read More

‘రిమ్స్’లో కార్మికుల నిరసన

సారథి న్యూస్, ఆదిలాబాద్ : సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక విధానాలపై శుక్రవారం రిమ్స్ ఆవరణలో కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జాదవ్ రాజేందర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పు, 12 గంటల పని దినాన్ని పెంచుతుందన్నారు. ఇలాంటి కుట్రలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కార్మికులందరికీ బోనస్ రూపంలో రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ […]

Read More

టీచర్లకు ఆన్ లైన్ శిక్షణ

సారథి న్యూస్, ఆదిలాబాద్: ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు హెచ్​ఎంలు, టీచర్లకు ఆన్ లైన్ శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్​ డీఈవో ఏ.రవీందర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ సంస్థలు సంయుక్తంగా కోవిడ్ –19  మానసిక సంసిద్ధతపై క్లాసెస్​ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని స్కూళ్ల నుంచి టీచర్లు హాజరుకావాలని సూచించారు. ఈనెల 17వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

Read More
మేమున్నామని..

మేమున్నామని..

సారథి న్యూస్, ఆదిలాబాద్: బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఓ వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించారు.  మహారాష్ట్రలోని పుసద్ కు చెందిన కళావతి శేశరావ్ ఢగే(65) ఆదిలాబాద్​లోని ఓ జిన్నింగ్ మిల్లులో పనిచేస్తోంది. ఆమె మృతిచెందడంతో మానవతా హృదయంతో అంత్యక్రియలు నిర్వహించినట్లు సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తెలిపారు.

Read More