సామాజిక సారథి, సిద్దిపేట: మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంటింటా ప్రచారం చేసినట్లు టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు వంగ వెంకట్రాంరెడ్డి తెలిపారు. ఆదివారం మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని […]
ఓపెన్ కాస్ట్ భూనిర్వాసితులకు భరోసా కల్పించారు. సామాజిక సారథి, మందమర్రి (మంచిర్యాల): అధైర్యపడొద్దు అండగా ఉంటామని బిఎస్పీ నాయకులు ఎం.వి.గుణ అన్నారు. ఆదివారం దుబ్బగూడెం భూనిర్వాసితుల కుటుంబాలను కలిసి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా మందమర్రిలోని కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో కాసిపేట మండలం, దుబ్బగూడెం ప్రజలు తమ భూమి కోల్పోతున్నారని చెప్పారు. గ్రామంలో 203 ఇండ్లు ఉండగా, అధికారులు కలిసి ఇటీవల 80ఇండ్లకు తాత్కాలిక నిర్మాణం పనులు […]
సామాజిక సారథి, ఆమనగల్లు: అంగరంగవైభవంగా సదర్ సమ్మేళనం ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదర్ సమ్మేళనం ఉత్సవాలు మొట్టమొదటి సారిగా ఆమనగల్లు పట్టణంలో ఇంత బ్రహ్మడంగా, కనుల పండుగా నిర్వహించిన యాదవ సోదరులను అభినందించారు. నరకాసురుని వధించిన దానికి ప్రతీకగా సదర్ సమ్మేళనం నిర్వహిస్తారని అన్నారు. ఇదే విధంగా ఆమనగల్లు కూడా అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని, 15రోజుల్లో అభివృద్ది పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆమనగల్లు పట్టణంలో […]