అమ్మవారి కాళ్ల దగ్గర మొండెంలేని తల ఉలిక్కిపడిన నల్లగొండ జిల్లావాసులు సూర్యపేట జిల్లా పాలకవీడు మండల వాసిగా గుర్తింపు భయాందోళనలో చింతపల్లి మండల వాసులు సామాజికసారథి, నల్లగొండ క్రైం: మొండెం నుంచి వేరుచేసిన తలను గుర్తుతెలియని దుండగులు మైసమ్మ దేవత కాళ్ల వద్ద పెట్టి వెళ్లడంతో నల్లగొండ జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చింతపల్లి మండలం విరాట్ నగర్ గ్రామంలో సోమవారం ఉదయం వెలుగుచూసిన ఈ సంచలన ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్- నాగార్జున సాగర్ […]
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: రాష్ట్రంలో అణువణువునా ముఖ్య మంత్రి కేసీఆర్ కనిపిస్తున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. సోమవారం తూడుకుర్తి, నాగర్ కర్నూల్, తెలకపల్లి మండలంలోని నడిగడ్డ గ్రామాల్లో నిర్వహించిన రైతుబంధు సంబరాల్లో జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి హాజరయ్యారు. అంతకుముందు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో నిర్వహించిన ర్యాలీలో వారు పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మొక్కలో, […]
సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో జనవరి 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత శాఖల అధికారులను కోరారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ , అనుబంధ శాఖలతో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజర్షి మాట్లాడుతూ ఈ […]
కోర్టుకు రాఘవ రిమాండ్ రిపోర్ట్ మొత్తం 12 కేసులున్నాయని వివరణ సామాజిక సారథి, భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులుగా ఉన్న రామకృష్ణ తల్లి సూర్యావతి, అక్క లీలా మాధవిలను కొత్తగూడెంలో పాల్వంచ పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తగూడెం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా వారికి న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. అక్కడి నుంచి పోలీసులు ఖమ్మం సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులు ప్రధాన నిందితుడు రాఘవను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ […]
ఎమ్మార్పీఎస్వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మల్లాయిపల్లి బాలిక కుటుంబానికి మందకృష్ణ పరామర్శ సామాజిక సారథి, వనపర్తి: మల్లాయిపల్లి బాలిక లైంగిక దాడి కేసును ఫాస్ట్రాక్కోర్టుకు అప్పగించాలని ఎమ్మార్పీఎస్వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మల్లాయిపల్లి బాలిక కుటుంబాన్ని ఆయన పరమార్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు, మహిళలపై లైంగిక దాడులు, హత్యలు పెరిగిపోయాయని, ఒక వారం రోజుల్లోనే చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల, వనపర్తి జిల్లా మల్లాయిపల్లిలలో […]
మహాకుంభ సంప్రోక్షణపై చర్చ యాదాద్రి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై సమాలోచన సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి విచ్చేశారు. సీఎం వెంట మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, మై హోం అధినేత రామేశ్వరరావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. కాగా, సీఎం కేసీఆర్ కు ఆశ్రమ రుత్విక్కులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్, చినజీయర్ స్వామి సమావేశమయ్యారు. యాదాద్రి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించారు. మార్చి 21నుంచి […]
రాష్ట్రాన్ని ద్రోహుల అడ్డాగా మార్చేందుకు కుట్రలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సామాజికసారథి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సీపీఎం, ఎంఐఎం పార్టీలతో సీఎం కేసీఆర్చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని తెలంగాణ ద్రోహుల అడ్డాగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలో హనుమకొండలో ఏర్పాటుచేసిన నిరసన సభలో అసోం సీఎం హిమంత్ బిశ్వశర్మతో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కమలం జెండా ఎగరవేస్తామని వ్యక్తం […]
ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించాలి పరీక్షలు, ఆక్సిజన్బెడ్ల సంఖ్యను పెంచాలి దివ్యాంగులు, గర్భిణులకు వర్క్ ఫ్రం హోం ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ సమీక్ష న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా, ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్ పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం సాయంత్రం ఉన్నతాధికారులతో సమావేశయ్యారు. యుద్ధ ప్రాతిపదికన వయోజనులందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్, చికిత్సపై శాస్త్రీయ పరిశోధన మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ […]