సామాజిక సారథి, నాగర్ కర్నూల్: అచ్చంపేట నియోజకవర్గంలో లక్కీ స్కీమ్ నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసు కోవాలని మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీ కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అండతో దోమల పెంట, బల్మూరుకు చెందిన టీఆర్ఎస్ నాయకులూ బోగస్ సంస్థలను […]
మంత్రి గంగుల కమలాకర్ సామాజికసారథి, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్ష, పోలీసులు భగ్నం చేయడంపై ఆదివారం రాత్రి మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఒక ఎంపీ చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా? అని నిలదీశారు. ఢిల్లీలో ఎవరైనా దీక్షలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకే జీవోనం.317 ఇచ్చామని తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటించే బాధ్యత […]
జైనథ్: మండలంలోని పూసాయి గ్రామంలో గల అతిప్రాచీన ఆలయమైన ఎల్లమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో ప్రతీ సంవత్సరం మాదిరిగానే పుష్యమాసం నుంచి మాగమాసం వరకు నెల రోజుల పాటు జాతర కొనసాగుతుందని గ్రామస్తులు తెలిపారు. పూసాయి జాతర ప్రారంభం మొదటి రోజున అయిన ఆదివారం గ్రామ మహిళలు భక్తులు డప్పు బజాల మధ్య బోనాన్ని మట్టికుండల్లో తలపై పెట్టుకొని డప్పులు, బాజాల మధ్య ఎల్లమ్మ తల్లికి సమర్పించారు. ఎల్లమ్మ గరగుడి నుంచి స్థానిక కోనేరులో చేరే నీటితో […]
టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి సామాజికసారథి, హైదరాబాద్: టీఆర్ఎస్ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని గంజాయి తెలంగాణగా మార్చేశారని ఆరోపించారు. గంజాయి మత్తులో టీఆర్ఎస్ గూండాలు కాంగ్రెస్ నేతను హత్య చేశారని తెలిపారు. ప్రజల మధ్య మద్యం సేవించవద్దన్నందుకు.. టీఆర్ఎస్ నేతలు దాడి చేసి హత్య చేశారని దుయ్యబట్టారు. నిందితులను అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ తరఫున పెద్దఎత్తున ఉద్యమిస్తుందని తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ.50లక్షల […]
సామాజికసారథి, హైదరాబాద్: టీఆర్ఎస్ మాజీనేత గట్టు రామచంద్రరావు షర్మిల పార్టీలోకి చేరనున్నారు. సోమవారం వైఎస్ షర్మిల సమక్షంలో రామచంద్రరావు పార్టీలో చేరుతారని చెబుతున్నారు. టీఆర్ఎస్‌లో ఉద్యమకారులకు ప్రాధాన్యత లేదని ఇటీవల టీఆర్ఎస్‌కు రాజీనామా గట్టు రామచంద్రరావు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తారని రామచంద్రరావు ఆశించారు. అయితే గట్టుకు కాకుండా తాతా మధుకు ఆ స్థానాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారు. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన గట్టు రాజీనామా చేశారని తెలుస్తోంది. […]
ఆర్చరీ టోర్నీ రాష్ట్రానికే గర్వకారణం మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సామాజికసారథి, హైదరాబాద్: యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్టీపీసీ వంటి సంస్థలు ఆర్చరీ (విలువిద్య) క్రీడలను నిర్వహించడానికి ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇలాంటి క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో మొదటి ఎన్టీపీసీ నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… […]
కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి సామాజికసారథి, హైదరాబాద్: నేటి యువత అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ లో జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్నగర్క్లబ్లో క్షత్రీయ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మన్యంవీరుడు అల్లూరి సీతారామారావు 125వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అల్లూరి మ్యూజియాలను లంబసింగిలో రూ.35కోట్లు, హైదరాబాద్‌లో రూ.18కోట్లతో నిర్మిస్తున్నామని, వీలైనంత త్వరగా మ్యూజియాలను నిర్మించి జాతికి అంకితం చేయాలని రెండు ప్రభుత్వాలను కోరుతున్నానని అన్నారు. అల్లూరి సీతారామరాజు […]
మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు మరోవైపు వణికిస్తున్న ఒమిక్రాన్ 3నుంచి 4 రెట్లు వేగంగా వ్యాప్తి చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆంక్షలు తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సమీక్ష 15 నుంచి 18 ఏళ్లలోపువారికి వ్యాక్సినేషన్ అలర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 27వేలకుపైగా కొత్త కేసులు నమోదుకావడం కలవరపెడుతోంది. అంతకుముందు రోజుతో పోల్చితే కొత్త కేసులు 21శాతం పెరిగాయి. మరోవైపు కొత్త […]