Breaking News

పూసాయి ఎల్లమ్మ జాతరకు వేళాయే

పూసాయి ఎల్లమ్మ జాతరకు వేళాయే

జైనథ్‌: మండలంలోని పూసాయి గ్రామంలో గల అతిప్రాచీన ఆలయమైన ఎల్లమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో ప్రతీ సంవత్సరం మాదిరిగానే పుష్యమాసం నుంచి మాగమాసం వరకు నెల రోజుల పాటు జాతర కొనసాగుతుందని గ్రామస్తులు తెలిపారు. పూసాయి జాతర ప్రారంభం మొదటి రోజున అయిన ఆదివారం గ్రామ మహిళలు భక్తులు డప్పు బజాల మధ్య బోనాన్ని మట్టికుండల్లో తలపై పెట్టుకొని డప్పులు, బాజాల మధ్య ఎల్లమ్మ తల్లికి సమర్పించారు. ఎల్లమ్మ గరగుడి నుంచి స్థానిక కోనేరులో చేరే నీటితో స్నానమాచరించిన చర్మవ్యాధులు నయమవుతాయని, దీంతో పాటు పంటలకు కొనేరు నీటిని చల్లితే చీడపీడలు నయమవుతాయని స్థానిక భక్తుల విశ్వాసం. నెలరోజుల పాటు జరిగే ఈ జాతరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు హాజరు కానున్నారు.