సీఎం కేసీఆర్ గద్దె దిగడం ఖాయం మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు శాపంగా 317జీవో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో ధర్మయుద్ధం మొదలైందని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తెలంగాణ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని కాషాయ జెండా రెపరెపలాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆ […]
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సామాజికసారథి, హైదరాబాద్: ఏపీలో పార్టీపై ఏర్పాటుపై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎవరైనా, ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చని, అదే విషయం తాను చెప్పానని తెలిపారు. తన బతుకు ఇక్కడే ముడిపడి ఉందన్నారు. వైఎస్సార్‌ను ప్రేమించిన ఈ ప్రజలకు సేవ చేయడానికే వైఎస్సార్టీపీ పుట్టిందని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చని జోస్యం చెప్పారు. అధికారంలో ఉంటాననుకోవడం మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. అధికారంలో లేనివారు.. అధికారంలోకి […]
సామాజిక సారథి, కౌడిపల్లి: అప్పుల బాధతో ఓ రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచన్ పల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంచన్ పల్లి గ్రామానికి చెందిన దుంపల మల్లేశం(40) తనకున్న 30 గుంటల వ్యవసాయ పొలంలో వరి సాగుచేస్తున్నాడు. కాగా, వ్యావసాయానికి, తన కుమార్తె వివాహంకోసం రూ.4లక్షల వరకూ అప్పు చేశాడు. అప్పలు ఎలా తీర్చాలో తెలియక మల్లేశం తీవ్ర […]
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ హాస్పిటల్‌లో ఆక్సిజన్ ప్లాంట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. ఇటీవల కాలంలో కరోనాతో బాధపడుతున్నవారు ఆక్సిజన్ లేక తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో కుప్పం నియోజకవర్గానికి ఆక్సిజన్ కొరత ఉండకూడదని భవిష్యత్ కార్యాచరణతో ఈ ప్లాంట్ ను ప్రారంభించినట్లు తెలిపారు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి, కుప్పం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో […]
చిత్తరంజన్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ రెండో క్యాంపస్ వీడియో కాన్ఫరెన్స్ద్వారా ప్రారంభించిన ప్రధాని మోడీ కోల్‌కతా: దేశంలోని ప్రతి పౌరుడికి అత్యుత్తమ ఆరోగ్య సదుపాయాలను బలోపేతం చేసే దిశగా మరో అడుగు వేశామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. తద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు, ఎవరైనా కేన్సర్‌తో పోరాడుతున్న వారికి ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా 15 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడంతో దేశం ఈ సంవత్సరాన్ని ప్రారంభించిందని ప్రధాని మోడీ అన్నారు. అదే సమయంలో ఈ ఏడాది […]
బాధితులు అవస్థలు పడుతున్నారు డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ హెచ్చరిక జెనీవా: ఒమిక్రాన్ తేలిక పాటి లక్షణాలేనని లైట్‌గా తీసుకోవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా హెచ్చరించింది. ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమైన వేరియంటే అని ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఆస్పత్రుల్లో బాధితులు అవస్థలు పడుతున్నారని, మరణాలు కూడా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథానమ్ వెల్లడించారు. ఇదిలాఉండగా, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ మోల్నుపిరవిర్ క్యాప్సూల్స్‌పై కీలక ప్రకటన చేశారు. […]
టెక్నాలజీపై దేశవ్యాప్తంగా చైతన్యం కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఐటీఐఆర్‌ను కేటాయించండి: మంత్రి కేటీఆర్ హెచ్‌ఐసీసీలో ఈ గవర్నెన్స్ సెమినార్ సామాజికసారథి, హైదరాబాద్: టెక్నాలజీపై దేశవ్యాప్తంగా చైతన్యం కల్పిస్తున్నామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. అందుకోసం అన్ని రాష్ట్రాల్లోనూ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నామని, న్యూ ఇన్నోవేషన్, న్యూ టెక్నాలజీలో హైదరాబాద్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. కొవిడ్ పాండమిక్‌లో చాలా రంగాలు డిజిటలైజేషన్ మీదే ఆధారపడ్డాయని గుర్తుచేశారు. తద్వారా పనులు సులువు అయ్యాయని పేర్కొన్నారు. రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఎక్కువగా పనిచేస్తున్నారని, […]
మాల్స్, షాపుల్లో వ్యాక్సిన వేసుకోనివారికి నో ఎంట్రీ గౌహతి: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ అసోం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నిన్న మొన్నటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ రాలేదు అనుకుంటున్న తరుణంలో శుక్రవారం ఒకేరోజు ఏడు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో కేసుల సంఖ్య 9కి చేరింది. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికి ఒమిక్రాన్ సోకినట్లు తేలడంతో వెంటనే స్పందించింది. కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. కరోనాను తేలిగ్గా తీసుకోవద్దని.. మార్గదర్శకాలను […]