![వైఎస్ షర్మిల దీక్ష భగ్నం, అరెస్ట్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/12/11HSB23.jpg?fit=467%2C350&ssl=1)
సామాజిక సారథి, మెదక్: ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్చేస్తూ మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం బొగుడు భూపతిపూర్ గ్రామంలో వైఎస్సార్ టీపీ నాయకురాలు షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. షర్మిలతో పాటు పలువురు పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు షర్మిల మాట్లాడుతూ.. రైతు రవి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిహారం ఇచ్చేవరకూ దీక్ష కొనసాగుతుందన్నారు. అప్పటిదాకా ఇక్కడి నుంచి కదిలేది భీష్మించారు. స్వయంగా సీఎం పేరు చెప్పి రైతు రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడని గుర్తుచేశారు. రైతులకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పి, సీఎం పదవికి రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. అంతకుముందు వైఎస్షర్మిల దీక్ష మూడుగంటల పాటు కొనసాగింది.