సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి సామాజిక సారథి, సిద్దిపేట: ఆశతో కాదు..ఆశయంతో వస్తున్న అని సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన జన్మదినవేడుకల్లో మాట్లాడారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్రజాపథంలో నడిపేందుకు అనునిత్యం కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం నా కుటుంబంగా భావిస్తున్నానన్నారు. ప్రజా శ్రేయస్సు, సంక్షేమమే ధ్యేయంగా అనునిత్యం ప్రజల కోసం పాటు పడుతనని […]
రోడ్డుపై బైఠాయించి, ప్లకార్డులతో బాధితుల ఆందోళన సామాజికసారథి, రామడుగు: తమ భూమిని సర్పంచ్ భర్త ఇతరులు కలిసి భూకబ్జా చేశారని ప్లకార్డులతో బాధితులు రోడ్డుపై ఆందోళన చేశారు. రామడుగు మండలంలోని రంగసాయిపల్లి గ్రామానికి చెందిన సాదు మనమ్మకు ఇద్దరు కుమారులున్నారు. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల్లో జీవనం గడుపుతున్నారు. ఇదే అదనుగా భావించినా రంగసాయి పల్లె సర్పంచి సాదు పద్మ భర్త మునీందర్ తో పాటు మరికొంత కలిసి మాకున్న 10గుంటల భూమిని కబ్జా చేసిండ్రని […]
అదనపు కలెక్టర్ వీరారెడ్డి సామాజిక సారథి, సంగారెడ్డి: ప్రజావాణిలో వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలతో వచ్చిన సుమారు 50 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. కార్యక్రమంలో రెవెన్యూ జిల్లా అధికారి రాధికరమణి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అర్జిదారులు పాల్గొన్నారు.
సామాజిక సారథి, వరంగల్ జిల్లా ప్రతినిధి: టీఆర్ఎస్ పార్టీ తరుఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వెంట మంత్రులు దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ సీఎం కడియంశ్రీహరి, ఎమ్మెల్యేలు, నరేందర్ వినయ్ భాస్కర్ మేయర్ గుండు సుధారాణిలు ఉన్నారు. తెలంగాణలో కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ఎమ్మెల్సీ బండా […]
సామాజిక సారథి, వలిగొండ: ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా రైతు బంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమతానరేందర్ రెడ్డి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సన్మానించి, పూలబొకేను అందజేశారు.
సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: బహుజనులంతా ఏకమై, రాజ్యాధికారం దిశగా పయనించాలని బీఎస్పీ నల్లగొండ మండల కన్వీనర్ దున్న లింగస్వామి అన్నారు. సోమవారం నల్లగొండ మండలం బుద్ధారం గ్రామంలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. నెల 23న బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించి, బహుజన వాదాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పారు. కార్యక్రమంలో నల్లగొండ సెక్టార్ కార్యదర్శులు పులిగిల్ల మహేష్, బకరం శశికాంత్ బుద్ధారం […]
– డీఐజీ ఏవీ రంగనాథ్ – గ్రీవెన్స్ లో పలు ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ సామాజిక సారథి, నల్లగొండ ప్రతినిధి: ప్రజలకు పోలీస్ శాఖను ప్రజలకు చేరువ చేసి, ప్రజాసమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జిదారులతో నేరుగా మాట్లాడి, సమస్యలు తెలుసుకున్నారు. ఓ బాధితుడు తన భూసమస్యను తెలియజేసేందుకు అంబులెన్స్ […]
సామాజిక సారథి, నల్లగొండ: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నల్లగొండ జిల్లా యువజన విభాగం కన్వీనర్ గా నల్లగొండకు చెందిన యువజన నాయకుడు సింగం లక్ష్మి నారాయణ నియామకమయ్యారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిళ ఆదేశాలతో నల్గొండ పార్లమెంటరీ కన్వీనర్ పిట్ట రామ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సింగం లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకపోతూ తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయడం సంతోషంగా ఉందని, నల్లగొండ […]