సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ఇటీవల వైద్యారోగ్యశాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రి టి.హరీశ్‌రావును ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు, తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, యువనేత డాక్టర్ కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. అందుకు తమవంతు సహకారం ఉంటుందని చెప్పారు. వైద్య, ఆరోగ్యరంగానికి సంబంధించిన పలు విషయాలపై కొద్దిసేపు చర్చించారు.
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కాలేజీ ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి(48) ఇకలేరు. శనివారం ఉదయం నాగర్ కర్నూల్ నుంచి కొల్లాపూర్ వెళ్తుండగా నాగర్ కర్నూల్ దాటిన తర్వాత నెల్లికొండ చౌరస్తాలో అతివేగంతో వచ్చిన కారుఆయనను ఢీకొట్టింది. దీంతో ప్రభాకర్ రెడ్డి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటనతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన అధ్యాపకుడిగా ఆయనకు […]
సామాజిక సారథి, భువనగిరి: రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా కలెక్టరేట్ల ముందు ధర్నాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ డ్రామాలకు తెరతీశాయని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రోడ్లపై ధర్నాలు చేపట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బట్టుగూడెంలో ఏర్పాటుచేసిన ‘బహుజన మేలుకొలుపు’ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఏడేళ్లుగా సీఎం కేసీఆర్ మాయమాటలతో కాలం […]