23,855వేల మెజారిటీ ఓట్లతో తిరుగులేని మెజార్టీ 7వ సారి ఎదురులేదని నిరూపించుకున్న ఈటల మరోసారి భారీమెజార్టీ కట్టబెట్టిన హుజూరాబాద్ ఓటర్లు ఉద్యమనేతగా అప్రతిహత విజయం ప్రజాభిమానం ముందు పారని తాయితాలు అధికార పార్టీకి కలిసిన రాని దళితబంధు ఆత్మాభిమానం ముందు తోకముడిచిన అహంకారం బీజేపీ కార్యాలయం వద్ద మిన్నంటిన సంబరాలు సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో విశ్వాసం లేదన్న బండి సంజయ్ సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ లో రాజేంద్రుడే విజయేంద్రుడిగా నిలిచారు. ప్రజల అభిమానం ముందు డబ్బులు, […]
ప్రచారం చేయకుండానే ఓట్లు కారు గుర్తును పోలిన చపాతీ రోలర్ 11వ రౌండ్ ముగిసే సరికి 1015 ఓట్లు వార్తల్లోకెక్కిన ప్రజాఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ సామాజిక సారథి, హుజూరాబాద్: ప్రజాఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ హుజూరాబాద్ఎన్నికల నేపథ్యంలో హాట్ టాపిక్ గా నిలిచాడు. మూడేళ్లలో ఆరుఎన్నికల్లో పోటీచేసిన ఆయన ప్రచారం చేయకుండానే ఓట్లు సాధిస్తున్నారు. టీఆర్ఎస్ పాలిట ఇబ్బందికర అభ్యర్థిగా మారారు. కారు గుర్తును పోలిన ఏ గుర్తుతోనైతే టీఆర్ఎస్ దుబ్బాకలో ఓడిపోయిందో […]
సామాజిక సారథి, హుజూరాబాద్: రాష్ట్రమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 10వ రౌండ్లో బీజేపీ 506 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్‌ముగిసే సరికి 5,637 ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉన్నారు. ఇప్పటివరకు 13 రౌండ్లు పూర్తయ్యాయి. 11వ రౌండ్లో బీజేపీ 3,941(48,588), టీఆర్ఎస్ 4,308 (43324) ఓట్లు సాధించింది. ఇక 13వ రౌండ్లో టీఆర్ఎస్ 2,971(49,945), బీజేపీ 4,836 (58,333 ) ఓట్లు సాధించింది. ఇప్పటివరకు బీజేపీ […]
సామాజిక సారథి, నల్లగొండ: హుజురాబాద్ ఫలితాలు ఉత్కంఠ లేపుతున్నాయి. రిజల్టుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన నల్లగొండలో విలేకరులతో మాట్లాడారు. ‘ఈటల రాజేందర్ 30వేల మెజార్టీతో గెలవబోతున్నాడు. హుజురాబాద్ ఉపఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ రూ.ఐదువేల కోట్లు ఖర్చు చేసింది. హుజురాబాద్ ఫలితాలు ఆ పార్టీకి చెంపపెట్టు. హుజురాబాద్ ప్రజలు అదిరిపోయే తీర్పు ఇవ్వబోతున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టలు ఈటల రాజేందర్ గెలుపును చూడకతప్పదు.’ అని వ్యాఖ్యానించారు.
సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివకు 8 రౌండ్లు పూర్తయ్యాయి. 8వ రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ దూసుకొచ్చారు. 162 ఓట్ల మెజార్టీ సాధించారు. దీంతో ఈటలకు మెజార్టీ కాస్త తగ్గినట్లయింది. 9 రౌండ్ లో టీఆర్ఎస్ కు 3,470, బీజేపీకి 5,305, కాంగ్రెస్ 1349 సాధించింది. ఈ రౌండ్లో బీజేపీ 1,835 లీడ్ సాధించింది. 9రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 5,111 ఓట్ల […]
బద్వేలు: కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికలో వైఎస్సార్ సీపీ ఘనవిజయం సాధించింది. మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్ నుంచి స్పష్టమైన ఆధిక్యం కనబరిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థి దాసరి సుధ విజయాన్ని విజయబావుటా ఎగరవేశారు. 90,411 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం 13 రౌండ్లు ముగిసే సరికి వైఎస్సార్సీపీకి 1,12,072, బీజేపీకి 21,661, కాంగ్రెస్‌కు 6,217, నోటాకు 3,636 ఓట్లు పోలయ్యాయి. వైఎస్సార్సీపీ హవా ముందు ఇతర పార్టీలు పోటీ ఇవ్వలేకపోయాయి.
సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రముఖంగా ఇద్దరి మధ్య విజయం దోబూచులాడుతోంది. ఇప్పటికే 8 రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. 7వ రౌండ్లో బీజేపీ 4,044 (31,027), టీఆర్ఎస్ 3,792 (27,589) ఓట్లు సాధించింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 3,438 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అయితే ఉన్నట్టుండి 8వ రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ దూసుకొచ్చారు. 8వ రౌండ్ లో 162 […]
సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. టీఆర్ఎస్ శిబిరంలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. 8, 9, 10వ రౌండ్లు వీణవంక, 10, 11, 12,13,14,15 రౌండ్లు జమ్మికుంట, 16వ రౌండ్లో జమ్మికుంటతో పాటు ఇల్లందుల, 17,18వ రౌండ్లు ఇల్లందుల, కమలాపూర్, 19, 20, 21,22వ రౌండ్లలో కమలాపూర్ ఓట్లను ఎన్నిక కౌంటింగ్ అధికారులు లెక్కించనున్నారు. ఇప్పటికే 7 రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రస్తుతం […]