సామాజిక సారథి, రామడుగు: హెల్మెట్ ధరించి బైక్ నడపాలని బ్లూకోట్ పోలీసులు గురువారం పలువురికి అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ మాస్కులు విధిగా ధరించాలని, డ్రంకెన్ డ్రైవ్ చేయకూడదని సూచించారు. రామడుగు ప్రధాన కూడళ్లలో గ్రామస్తులు, వాహనదారులకు అవగాహన కల్పించినట్లు పోలీసులు తెలిపారు.
సామాజిక సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ పార్వతి సమీత రాజరాజేశ్వరి స్వామివారిని శుక్రవారం సిద్దిపేట ట్రెయిని అసిస్టెంట్ కలెక్టర్ ఫ్రూఫ్ దేశాయి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదొక్తంగా ఆశీర్వచనాలు అందించారు. ఏఈవో ప్రతాప నవీన్ కండువా కప్పి సన్మానించి లడ్డూప్రసాదం అందజేశారు.
సామాజిక సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాతగిరి శంకర దాసమయస్వామి ఆలయానికి మాజీ వార్డు సభ్యురాలు సాయిని విజయ దేవయ్య 1600 గ్రాములతో తయారుచేసిన నాగదేవత వెండి ప్రతిమను బహూకరించారు. అర్చకులు ప్రామక మనోహర్, చొప్పకట్ల కార్తీక్ ఆధ్వర్యంలో అభిషేకం జరిపించారు. కార్యక్రమంలో చందు, దుర్గేశం తదితరులు పాల్గొన్నారు.
సామాజిక సారథి, అచ్చంపేట: నల్లమల ప్రాంతమైన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో బీఎస్పీని బలోపేతం చేస్తామని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా కార్యదర్శి అడ్వకేట్ శ్రీనివాసులు అన్నారు. ఇతర పార్టీల నుంచి ఎంతో మంది పార్టీలో చేరుతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేస్తున్న సెక్టార్ కమిటీల నిర్మాణంలో భాగంగా శుక్రవారం పదర మండలంలో పలు కమిటీలను ఎన్నుకున్నారు. పదద, చిట్లంకుంట సెక్టార్ కమిటీల అధ్యక్షులుగా ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా లోకేష్, మరుకొందయ్య ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పార్టీ […]
సామాజిక సారథి, వరంగల్: వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ గా పి.ప్రావీణ్య శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. విభాగాల వారీగా అధికారులతో పరిచయం చేసుకున్న ఆమె మాట్లాడుతూ.. జీడబ్ల్యూఎంసీ పరిధిలో వివిధ పథకాల కింద ఆయా విభాగాల ద్వారా కొనసాగుతున్న, పెండింగ్ లో ఉన్న, చేపట్టబోయే అభివృద్ధి పనుల సమాచారం అందుబాటులో ఉండాలని సూచించారు. కమిషనర్ గా పి.ప్రావీణ్యకు అదనపు కమిషనర్ సీహెచ్.నాగేశ్వర్, ఎస్ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ వో డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్ఓ సునీత, […]
ఆర్ఎంపీ వచ్చీరాని ట్రీట్మెంట్ పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి తల్లిదండ్రులతో గోప్యంగా బేరం సామాజిక సారథి, బిజినేపల్లి: వైద్యం వికటించడంతో బాలుడు మృతిచెందిన సంఘటన విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం పంచాయతీ పరిధిలోని ఓ గిరిజన తండాలో గురువారం జరిగింది. బాధితుల కథనం మేరకు.. తండాకు చెందిన బాలుడు(11) మూడు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు బిజినేపల్లి మండల కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు వైద్యం కోసం తీసుకెళ్లారు. అతను వచ్చీరాని […]