Breaking News

Day: July 15, 2021

నా మాటలను వక్రీకరించారు.. విచారం వ్యక్తంచేస్తున్నా: మంత్రి

నా మాటలను వక్రీకరించారు.. విచారం వ్యక్తంచేస్తున్నా: మంత్రి

సారథి ప్రతినిధి, నాగర్​కర్నూల్: నాగర్ కర్నూల్ ​జిల్లా కేంద్రంలో ‘దిశ’ సమీక్ష సమావేశంలో తాను మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు సంచలనం కోసం ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచిందని, ఏ ప్రభుత్వమూ ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదని, ఉద్యోగం అంటేనే […]

Read More
ప్రజలకు పారదర్శకంగా ధరణి సేవలు

ప్రజలకు పారదర్శకంగా ధరణి సేవలు

సారథి, మానవపాడు: ధరణి సేవలను ప్రజలకు అందుబాటులో పారదర్శకంగా అందించాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఈడీఎం ఫారూఖ్ సూచించారు. గురువారం మానవపాడు మండల కేంద్రంలోని మీసేవ సెంటర్లను ఆయన పరిశీలించారు. మీసేవ ద్వారా అందించే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు రైతులకు అందించే సేవలకు అధిక రేట్లు తీసుకోకుండా ప్రభుత్వం సేవలు అందించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కూడా పారదర్శకత పాటించాలని ఆదేశించారు. అనంతరం మానపాడు తహసీల్దార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ రైతులకు […]

Read More
భూసేకరణ నిలిపివేయాలి

భూసేకరణ నిలిపివేయండి

సారథి, రామడుగు: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగమైన కరీంనగర్​జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంపు హౌస్ నుంచి మిడ్ మానేరుకు అదనంగా మూడవ టీఎంసీ జలాల తరలింపునకు చేపట్టబోయే నూతన కాల్వ భూసేకరణను నిలిపివేయాలని శానగర్ గ్రామస్తులు అభ్యంతరం చెప్పారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్​ కోమల్​రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గతంలో నిర్మించిన వరద కాల్వ భూసేకరణలో చాలా మంది రైతులు తమ విలువైన భూముల కోల్పోయారని, ఇప్పుడు రెండవ, మూడవ సారి ఇండ్లు, భూములను […]

Read More
బోదకాల నివారణ మాత్రలు పంపిణీ

బోదకాల నివారణ మాత్రలు పంపిణీ

సారథి, రామాయంపేట: బోదవ్యాధి నివారణకు గురువారం రామాయంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో డాక్టర్లు మాత్రలు పంపిణీ చేశారు. భోజనం తర్వాత వాటిని వేసుకోవాలని సెంట్రల్ అబ్జర్వర్ ​డాక్టర్ రవీంద్ర, కుమారస్వామి, జిల్లా మలేరియా ఆఫీసర్ సూచించారు. కార్యక్రమంలో ధర్మారం పీహెచ్​సీ డాక్టర్ ఎలిజబెత్ రాణి, హెచ్​ఈవో రవీందర్, ఆరోగ్య కార్యకర్తలు, వలంటీర్లు పాల్గొన్నారు.

Read More
వెదజల్లే పద్ధతిలో అధిక లాభాలు

వెదజల్లే పద్ధతిలో అధిక లాభాలు

సారథి, పెద్దశంకరంపేట: వరి పంట సాగులో వెదజల్లే పద్ధతి ద్వారా అధిక దిగుబడి సాధించవని మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండల వ్యవసాయాధికారి అమృత అన్నారు. గురువారం మండలంలోని ఉత్తులూర్ శివారులో డ్రమ్​సీడర్ ద్వారా వరిసాగులో వెదజల్లే పద్ధతిలో విత్తనాలు వేశారు. ఈ పద్ధతిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఏఈవో రాజు, పలువురు రైతులు ఉన్నారు.

Read More
జాతీయ చిత్రలేఖనం పోటీల్లో గురుకుల తేజం

జాతీయ చిత్రలేఖనం పోటీల్లో గురుకుల తేజం

సారథి, బిజినేపల్లి: జేఎస్​డబ్ల్యూ పెయింట్స్ ​సంస్థ వారు నిర్వహించిన జాతీయస్థాయి చిత్రలేఖనం పోటీల్లో నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల స్కూలు విద్యార్థి బి.శివకుమార్ ​ఉత్తమ ప్రతిభ చాటాడు. గురువారం స్కూలు ఆర్ట్​ టీచర్​ భాగ్యమ్మ, ప్రిన్సిపల్​తో కలిసి గురుకుల విద్యాలయాల సంస్థ డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థి బి.శివకుమార్​ను సన్మానించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహించిన తీరును అభినందించారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను […]

Read More