సారథి, చొప్పదండి: అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చొప్పదండి తహసీల్దార్ ఆఫీసు ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ.. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన 20 మంది లబ్ధిదారులకు రూ.8,02,500 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను సోమవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. గతంలో ముఖ్యమంత్రి సహాయనిధి అంటే ఎవరికీ తెలిసేది కాదన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న […]
సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల ఖండ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. పర్యావరణ ప్రముఖ్ గా రవివర్మ, ఖండ వ్యవస్థ ప్రముఖ్ గా వీరప్ప, ఖండ కార్యవాహ్ గా జహిందర్ రెడ్డి, సహ కార్యవాహ్ గా సీతారామరావు, సంపర్క్ ప్రముఖ్ గా కృష్ణమూర్తి, బౌద్ధిక్ ప్రముఖ్ గా సర్వేశ్వర్, ఖండ ముఖ్యకార్యకర్తగా సతీష్ గౌడ్, సేవా ప్రముఖ్ గా విశ్వేశ్వర్ గౌడ్, ఖండ కార్యకర్తగా మల్గొండ మధును నియమించారు.
సారథి, చొప్పదండి: సర్కారు భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 15న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం చొప్పదండి మండలం రుక్మపూర్ గ్రామంలో సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములను వేలం వేసి అమ్మడానికి నిర్ణయించడం దుర్మార్గమని, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి, వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టుబడిదారీవర్గాలకు, పార్టీ నాయకులకు అప్పనంగా […]
సారథి, వేములవాడ: దక్షిణకాశీ ఆలయంగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని కుటుంబసమేతంగా రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరామ్ భూక్య దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. అభిషేకం అనంతరం లడ్డూ ప్రసాదం అందజేశారు.
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రానికి చెందిన రైతుబంధు సమితి సభ్యుడు పాల నర్సయ్య తండ్రి కొండయ్య ఇటీవల కన్నుమూశాడు. అతని కుటుంబాన్ని సోమవారం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గట్ల మీనయ్య పరామర్శించారు. అలాగే వారం రోజుల క్రితం సౌదీలో చనిపోయిన బోదాసు నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబ పరిస్థితి చూసి ఏనుగు మనోహర్ రెడ్డి రూ.ఐదువేలు, […]
సారథి, హైదరాబాద్: మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వద్ద స్థిరంగా కొనసాగుతుందని సోమవారం వెలువరించిన రిపోర్టులో వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా ద్రోణి మధ్య ట్రోపోస్పీయర్ స్థాయి వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉండి స్థిరంగా కొనసాగుతోందని, […]
సారథి, వడ్డేపల్లి(మానవపాడు): మాదాసి, మాదారి కురువ కులస్తులకు ఎస్సీ ధ్రువీకరణపత్రాలు ఇవ్వాలని సంఘం రాష్ట్ర కన్వీనర్దన్నడ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. సంఘం కార్యవర్గ సమావేశం ఆదివారం ఎస్సీ సంక్షేమ సంఘం కార్యదర్శి కురువ పల్లయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. మదాసి, మదారి కురువలకు ఎస్సీ కులధ్రువీకరణ పత్రాలను జారీచేయడంలో జిల్లా యంత్రాంగం అధికారులు ఆలస్యం చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంఘం నాయకులు వేణుగోపాల్, ఆంజనేయులు, అలంపూర్ తాలుకా నాయకులు సదానందమూర్తి, పెద్దసోమన్న, […]