Breaking News

Day: July 5, 2021

పల్లెప్రగతితో గ్రామాలకు సొబగులు

పల్లెప్రగతితో గ్రామాలకు సొబగులు

సారథి, కొల్లాపూర్: పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు మారనున్నాయని నాగర్​కర్నూల్ జిల్లా పరిషత్ చైర్​పర్సన్ ​పద్మావతమ్మ, కలెక్టర్ ఎల్.శర్మన్, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం కొల్లాపూర్ మండలం ఎల్లూరు, ముక్కిడిగుండం, పెంట్లవెల్లి మండలంలోని జటప్రోలు గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో మొక్కలు నాటారు. మన ఇంటిని, వీధిని, ఊరును మనమే శుభ్రంగా ఉంచుకోవాలని, పల్లె ప్రగతి కార్యక్రమం ఉద్దేశం అదేనని వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో […]

Read More
కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పరామర్శించిన బీజేపీ చీఫ్​

కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పరామర్శించిన బీజేపీ చీఫ్​

సారథి, హైదరాబాద్: చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాతృమూర్తి కొండా జయలతాదేవి ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ​సోమవారం కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. కొండా జయలతాదేవి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన వెంట బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి, ఎస్.కుమార్, సంగప్ప తదితరులు ఉన్నారు.

Read More
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం

హరితహారం.. స్ఫూర్తిదాయకం

సారథి, ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కేంద్రంలో మొక్కలు నాటి పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కె.చంద్రశేఖర్ రావు చేపట్టిన హరితహారం కార్యక్రమం దేశానికి స్ఫూర్తివంతంగా నిలిచిందన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా నడుస్తోందన్నారు. నాటిన మొక్కలను పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే […]

Read More
వీహెచ్ పీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

వీహెచ్ పీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

సారథి, చొప్పదండి: తెలంగాణలో గోహత్యలు, గోరక్షకులపై దాడులకు నిరసనగా విశ్వహిందూ పరిషత్(వీహెచ్​పీ) చొప్పదండి శాఖ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీహెచ్​పీ మండలాధ్యక్షుడు పడకంటి కృష్ణ మాట్లాడుతూ.. గోరక్షకుడు సంజయ్ పై హత్యాయత్నం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. గోహత్య నిరోధక చట్టాలను కఠినంగా అమలుచేయాలని, గో అక్రమ రవాణా గ్యాంగ్ ల పై పీడీ యాక్టు నమోదు చేయాలని, […]

Read More
పల్లె పులకించేలా ప్రగతి

పల్లె పులకించేలా ప్రగతి

  • July 5, 2021
  • Comments Off on పల్లె పులకించేలా ప్రగతి

మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సారథి, రామాయంపేట: పల్లె ప్రకృతి పులకించేలా, పల్లెజనం ఆరోగ్యంగా ఉండేలా సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ప్రతిష్టాత్మక చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కలను నాటడమే కాదు.. వాటిని బాధ్యతగా పెంచి కాపాడాలని సూచించారు. సోమవారం మెదక్ ​జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో 53 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం చల్మేడ గ్రామంలో మొక్కలు […]

Read More
వేములవాడకు పోటెత్తిన భక్తజనం

వేములవాడకు పోటెత్తిన భక్తజనం

సారథి, వేములవాడ: పవిత్ర పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారిని సోమవారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. కొంతమంది తలనీలాలు సమర్పించి, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా అడిషనల్​ కలెక్టర్ గరిమా అగర్వాల్ ​దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. పీఆర్వో చంద్రశేఖర్ ఆయనకు కండువా కప్పి లడ్డూప్రసాదం అందజేశారు.

Read More
ప్రతిష్టాత్మకంగా పల్లెప్రగతి

ప్రతిష్టాత్మకంగా పల్లెప్రగతి

నిర్వహణపై అధికారుల తీరు మారాలి గ్రామాల్లో పనులను పరిశీలించిన కలెక్టర్​ హరీశ్​ సారథి, పెద్దశంకరంపేట: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ అధికారులు, సిబ్బందికి సూచించారు. సోమవారం ఆయన పెద్దశంకరంపేట మండలంలోని జాంబికుంట, ఆరెపల్లి, కమలాపూర్, బుజ్రన్ పల్లి, కొల్లపల్లి తదితర గ్రామాల్లో పల్లెప్రగతి పనులను తనిఖీ చేశారు. ఆరేపల్లిలో గోతుల్లో మొక్కలు ఉండకుండా, కలుపు మొక్కలు పెరగడంతో పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్ […]

Read More