సారథి, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత పల్లెప్రగతి కార్యక్రమం కరీంనగర్ జిల్లా రామడుగు మండల వ్యాప్తంగా గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆయా గ్రామాల్లో నాయకులు, ప్రత్యేకాధికారులు పాల్గొని మొక్కలు నాటి పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. కొరటపల్లి గ్రామంలో ప్రత్యేకాధికారి మౌనిక ఆధ్వర్యంలో ఎంపీపీ కల్గెటి కవిత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నిర్దేశించిన ప్రకారం మొక్కలు నాటాలని, పాడుబడిన ఇండ్లను పూడ్చివేయాలని, శానిటేషన్ పనులు చేపట్టాలని సూచించారు. ప్రతిఇంటిలో ఆరు మొక్కలు నాటాలని ఎంపీపీ […]
అధికారులపై పెట్రోల్ పోసిన మహిళారైతు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ రంగప్రవేశంతో సద్దుమణిగిన వివాదం సారథి, అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమలలో పోడు భూముల వివాదం మరోసారి రగిలింది. అటవీశాఖ అధికారులు, ఆదివాసీ గిరిజనుల మధ్య అగ్గిరాజేసింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. అమ్రాబాద్ మండలం మాచారంలో 20 ఆదివాసీ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అదే గ్రామంలో సుమారు 60 ఎకరాల పోడు భూములను సాగుచేసుకుంటూ ఎన్నో ఏళ్లుగా జీవనోపాధి పొందుతున్నారు. […]
సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేటలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం డాక్టర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగానే గుండి పీహెచ్‌సీలోని ఇద్దరు డాక్టర్లను సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దురుశెట్టి మల్లేశం, సెక్రటరీ కోడీమ్యాల వేణుగోపాల్, కోశాధికారి రాంపల్లి శ్రీనివాస్, కోడీమ్యాల వెంకట్ రమణ, కర్ర శ్యాంసుందర్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
సారథి, రామాయంపేట: కొన్ని గంటల్లోనే పెళ్లి జరగనుంది. సంతోషాల మధ్య శుభకార్యం జరగాల్సిన ఆ ఇంటిలో చావు డప్పు మోగింది. పుస్తెమట్టెలను తీసుకొచ్చేందుకు వెళ్లిన పెళ్లికొడుకు తండ్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన గురువారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని 44వ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం.. పులిమామిడి గ్రామానికి చెందిన మందపురం రాజయ్య(55) చిన్నకుమారుడు గణేష్ వివాహం నగరం గ్రామంలో జరగాల్సి ఉంది. పులిమామిడి నుంచి రామాయంపేటకు వచ్చి పుస్తెమట్టెలు […]
సారథి, వేములవాడ: కరోనా మహమ్మారి బారినపడి చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వేములవాడ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు లాయక్‌పాషా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలని కోరారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని చెక్కపల్లి రోడ్డులో సర్వేనం.112 […]