సారథి, పెద్దశంకరంపేట: బతుకుదెరువు కోసం కర్నూలు జిల్లా డోన్నుంచి వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన మెదక్‌జిల్లా పెద్దశంకరంపేటలో బుధవారం జరిగింది. ఎస్సై నరేందర్ కథనం.. డోన్‌కు చెందిన దూదేకుల షేక్ షావలీ(45) పొట్టకూటి కోసం పెద్దశంకరంపేట్ వచ్చి తాపీమేస్త్రి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో తోటికార్మికుడు జయరాములు ఆస్పత్రికి తీసుకువెళ్తున్న సమయంలో మెదక్ రోడ్డులో పక్కనే కుప్పకూలిపోయాడు.. సంగారెడ్డిలో ఉంటున్న అతని సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు […]
సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేట్ మార్కెట్ కమిటీ పాలకవర్గ సర్వసభ్యసమావేశం చైర్మన్ గంట్ల వెంకట్ రెడ్డి అధ్యక్షతన బుధవారం మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో జరిగింది. పాలకవర్గ సభ్యులు పలు అభివృద్ధి పనులపై తీర్మానం చేశారు. వీటిలో రైతు విశ్రాంతి భవన నిర్మాణం, ప్రహరీపై పెయింటింగ్, పాత షెడ్ రిపేర్ చేయడం వంటి పలు అంశాలు చర్చించి వాటిని యుద్ధప్రాతిపాదికన పూర్తిచేయాలని తీర్మానించారు. అనంతరం హరితహారంలో భాగంగా మార్కెట్ యార్డ్ ఆవరణలో […]
సారథి, చొప్పదండి: జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి(బలిదాన్ దివాన్) సందర్భంగా బుధవారం కరీంనగర్జిల్లా చొప్పదండి పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ చొప్పదండి పట్టణ ఇన్చార్జ్దాసరి రమణారెడ్డి మాట్లాడుతూ.. దేశసమైక్యత, సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడని కొనియాడారు. దేశసమున్నత, సమైక్య భారత్ కోసం పోరాటం చేసిన మహోన్నత దేశభక్తుడని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మంచికట్ల మల్లేష్, […]
సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా మండలం రుద్రారం గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్స్, ధర్మజాగరణ సంస్థ ఆధ్వర్యంలో కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తమ ఉదారత చాటుకున్నారు. చిలుముల జలజ, పర్షిత, సుంకే అనిత, రంగశాయిపల్లి గ్రామానికి చెందిన నిరుపేదలు వేముల జ్యోతి, చిలుముల హన్మయ్యకు బుధవారం కరోనా కిట్స్, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు గుర్రం దేవిక, ధర్మజాగరణ సంస్థ సమన్వయకర్త పాకాల రాములుగౌడ్, రాజశేఖర్ గౌడ్ తదితరులు […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన చిచ్చా చాయ్ టీ స్టాల్ ను బుధవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెలమ మల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ గుర్రం నీరజ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి, నాయకులు తాల్లపల్లి శ్రీనివాస్, పబ్బ సత్యం, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
సారథి, రామాయంపేట: భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి(బలిదాన దివస్ ) సందర్భంగా బీజేపీ నిజాంపేట శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖర్జీ సేవలను కొనియాడారు. కశ్మీర్ విషయంలో ముఖర్జీ దేశంలో ఒకటే జెండా ఒక్కరే ప్రధాని ఒకటే శాసనం ఉండాలని కృషిచేశారని గుర్తుచేశారు. ముఖర్జీ నినాదాన్ని దేశ ప్రధాని నరేంద్రమోడీ దృష్టిలో ఉంచుకుని ఆర్టికల్ 370ను రద్దుచేశారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ తో […]
సారథి, కొల్లాపూర్: కొల్లాపూర్ మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్‌చేస్తూ బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ ఆఫీసు ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు శివవర్మ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రజలను కాపాడిన మున్సిపల్ సిబ్బంది కృషి మరువలేనిదని కొనియాడారు. పెంచిన వేతనాలను జూన్ నుంచి అమలు చేయాలని డిమాండ్‌చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రిషన్ సిబ్బంది, బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, […]
సారథి ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలో రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలను నాటి పచ్చదనం పెంచి అందమైన జగిత్యాలగా మార్చాలని జిల్లా కలెక్టర్ జి.రవి సూచించారు. జగిత్యాల నుంచి థరూర్ క్యాంప్, రాజరాంపల్లి, నూకపల్లి, మాల్యాల చౌరస్తా రోడ్డు, ముత్యంపేట, దొంగలమర్రి, పుడూరు, తుర్కకాశీనగర్, రైల్వే ట్రాక్ వరకు జాతీయ రహదారి 65కు ఇరువైపులా ఉపాధి హామీ కూలీలు చేపడుతున్న మొక్కలు నాటే పనులను మంగళవారం ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ […]