సారథి, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని కొత్తపేట, రామోజీపల్లి గ్రామాల్లో తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా కోఆర్డినేటర్కొమ్ముల శేఖర్ గౌడ్, నాగరాజు, సాయిలు, శ్రీనివాస్, మదన్, మాధవి, రవీందర్, రాజు నాయక్ కళాజాతా నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలైన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, నాణ్యమైన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, కరోనా వ్యాప్తిపై జాగ్రత్తలు, సూచనలు, వ్యాక్సినేషన్, మాస్క్ ప్రాధాన్యత, ఆరోగ్యం, హరితహారం, పల్లెప్రగతి, నూతన వ్యవసాయ పద్ధతులపై తమ ఆటాపాటల ద్వారా గ్రామస్తులకు […]
సారథి, కొల్లాపూర్: పట్టణంలోని దళిత రిపోర్టర్ రాజశేఖర్ పై అక్రమ కేసు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన పోలీసులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎస్పీకి మాలల చైతన్య సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మూలే కేశవులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు మద్దెల రామదాసులు గురువారం వేర్వేరు వినతిపత్రాలను అందజేశారు. సాయికృప హాస్పిటల్ డాక్టర్ కొండ శీను, విక్రమ్ గౌడ్ ఫిర్యాదు మేరకు రాజశేఖర్ పై కేసు నమోదు చేసి […]
సారథి, పెద్దశంకరంపేట/రామాయంపేట: ఏరువాక గురువారం జోరుగా సాగింది. పౌర్ణమి సందర్భంగా రైతులు ఎడ్లబండ్లు, నాగళ్లను మువ్వలు, వివిధ అలంకరణలు చేసి పొలం బాటపట్టారు. పెద్దశంకరంపేట, రామాయంపేట మండలాల్లో రైతన్నలు ఉత్సాహంగా నిర్వహించారు. వ్యవసాయ పనులను ప్రారంభించడానికి ముందు భూమికి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ శుభదినాన రైతులు, అన్నదాతలకు సిరులపంట పండుతుందని విశ్వాసం. జ్యేష్ఠ శుద్ధపౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని పిలుస్తుంటారు. పండుగ రోజున ఎద్దులను కడిగి వాటి కొమ్ములకు అందమైన రంగులు పూసి, […]
సారథి, రామాయంపేట: గ్రామాల్లో వర్షాకాలంలో డయేరియా లాంటి విషజ్వరాలు ప్రబలకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సూచించారు. గురువారం ఆమె మండలంలోని జెడ్ చెర్వు గ్రామంలో రూ.35 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పల్లెప్రగతి ప్రోగ్రామ్ ద్వారా సీఎం కేసీఆర్ గ్రామాలను బాగుచేయడం కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారని వివరించారు. యాసంగిలో పండిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు గవర్నమెంట్ కొనుగోలు చేసి రైతుల ఖాతాలో జమచేస్తున్నదని […]
సారథి, ములుగు: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ ఆలియాస్ యాప నారాయణ ఇటీవల కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. ములుగు జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామంలో హరిభూషణ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే సీతక్క గురువారం పరామర్శించారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఆమె వెంట గంగారం, కొత్తగూడ మండలాల ఎంపీపీలు సువర్ణపాక సరోజన జగ్గారావు, విజయ రూపుసింగ్, జడ్పీటీసీలు ఈసం రామ సురేష్ , పుష్పలత శ్రీనువాస్. వైస్ ఎంపీపీ ముడిగా వీరభద్ర […]
సారథి, వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని సినీనేపథ్య గాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ గురువారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సాదరస్వాగతం పలికారు. శాలువతో సన్మానం చేసి స్వామి వారి అభిషేకం లడ్డూప్రసాదంతో పాటు స్వామివారి ప్రతిమలను అందజేశారు. అంతకుముందు పట్టణంలోని సాయిబాబా ఆలయాన్ని ఏనుగు మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు.
సారథి, చొప్పదండి: పల్లెలు ప్రగతి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని కరీంనగర్జిల్లా చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్ అన్నారు. గురువారం చొప్పదండి మండలంలోని రాగంపేట గ్రామంలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం వరకు పల్లెనిద్ర పేరున పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తున్న పంచాయతీల ప్రగతి పర్యవేక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొక్కల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని తెలిపారు. ఖాళీస్థలాల్లో విరివిగా పెంచాలని సూచించారు. రాగంపేటలో ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్ […]
సారథి, కొల్లాపూర్: కరోనా మహమ్మారి బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు తక్షణ సాయం కింద ప్రభుత్వం మంజూరుచేసిన రూ.రెండువేల ఆర్థిక సహాయం చెక్కులను గురువారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అందజేశారు. నాగర్‌కర్నూల్‌జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలో 10మంది చిన్నారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సీడీపీవో వెంకట రమణమ్మ, ఐసీడీఎస్ నిరంజన్, సూపర్వైజర్లు పాల్గొన్నారు.సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కుల పంపిణీనిరుపేదలకు సీఎం రిలీఫ్ఫండ్వరంగా మారిందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన కొల్లాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే […]