సారథి, చొప్పదండి: చొప్పదండి జడ్పీ హైస్కూలులో సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ.. కరోనాను కట్టడి చేసేందుకు సూపర్ స్ప్రెడర్స్ కు తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేపట్టినట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకుని కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అత్యవసరం అయితేనే తప్ప ఎవరూ బయటికి రాకూడదని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజారెడ్డి, కౌన్సిలర్ మహేష్, నాయకులు మహేష్, శ్రీనివాస్ తదితరులు […]
సారథి, చొప్పదండి: కాంగ్రెస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్ చార్జ్ మేడిపల్లి సత్యం జన్మదినం సందర్భంగా మల్లన్నపల్లె గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన గొల్లె మౌనిక, సురేష్ దంపతుల కూతురు శ్రీవాణి వివాహానికి శనివారం ఆ పార్టీ నాయకులు రూ.5,116 ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబసభ్యులు మేడిపల్లి సత్యంకు కృతజ్ఞతలు తెలియజేసారు. యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు గొల్లె సంపత్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీసెల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ […]
సారథి, చిన్నశంకరంపేట: ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతోనే రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చిందని బీజేపీ కిసాన్ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి విమర్శించారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి, కొండాపూర్ గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అక్కడి రైతులు, హమాలీల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తడిసి నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. కొనుగోలు కేంద్రాలు, […]
సారథి, జగిత్యాల: ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా జగిత్యాల జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మొక్కలు నాటారు. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కంకరణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ జి.రవి, ఎస్పీ సింధూశర్మ, డీఎఫ్ వో వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్ ఒద్ది శ్రీలత రామ్మోహన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హర్షం సారథి ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని ఐదు గ్రామాలు, 17 గిరిజన తండాలకు సాగునీరు అందించే మార్కండేయ లిఫ్ట్ నిర్మాణానికి రూ.76.92 కోట్ల నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో నం.211 విడుదల చేసింది. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. బిజినేపల్లి మండలంలోని గంగారం, సాయిన్ పల్లి, మమ్మాయిపల్లి, సాయిన్ […]
సారథి, రామాయంపేట: ఉపాధి హామీ పథకం ద్వారా తీస్తున్న పూడిక మట్టి పంటలకు సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. రైతుల పంట సాగుకు అయ్యే ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. భూసారం పెరిగి అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అలాగే పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుందని వ్యవసాయ అధికారులు రైతులు సూచిస్తున్నారు. ఉపాధి హామీ పనులు పనిచేస్తున్న కూలీల వద్ద నుంచి ఉచితంగా పూడికమట్టిని తీసుకోవచ్చని, ట్రాక్టర్ కిరాయి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.పూడిక మట్టితో లాభాలు ఇవే […]
సారథి, అచ్చంపేట: ప్రజాసమస్యలను వెలుగులోకి తెస్తున్న తొలి వెలుగు ఛానల్ రిపోర్టర్, యాంకర్ రఘును పోలీసులు గురువారం ఉదయం మల్కాజిగిరిలో కిడ్నాప్ చేసిన ఘటనను టీయూడబ్ల్యూజే (ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా జిల్లా నాయకులు దశరథం నాయక్ మాట్లాడుతూ.. ప్రజలు సమస్యలు, భూకబ్జాలను వెలుగులోకి తీసుకొస్తున్న రఘును అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి గుర్రంపోడు గిరిజన భూముల ఆక్రమణలపై రాజ్ న్యూస్ రిపోర్టర్ గా కథనాలు అందించాడని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు […]
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండల కేంద్రంలో గురువారం ఫర్టిలైజర్ దుకాణాలను వ్యవసాయశాఖ, పోలీసు అధికారులు తనిఖీ చేశారు. రైతులను ఎవరైనా నకిలీ విత్తనాలు, నాసిరకం పురుగుల మందులు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అలాంటి వారిపై గ్రామాల్లో పోలీసుల నిఘా ఉంటుందని. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతులు లైసెన్సులు కలిగిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలుచేసి రికార్డులు పొందాలన్నారు. తనిఖీల్లో వేములవాడ డీఎస్పీతో పాటు […]