వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కల్వకోల్, కుడికిళ్లలో సబ్ స్టేషన్ల ప్రారంభం సారథి, కొల్లాపూర్: రాష్ట్రంలో వ్యవసాయానికి లోవోల్టేజీ సమస్య అధిగమించేందుకు అవసరమైన విద్యుత్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్, కొల్లాపూర్ మండలం కుడికిళ్లలో విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న […]
సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన నాంపల్లిలో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ డెయిరీ పేరుతో ఉన్న వాహనంలో తరలిస్తున్న సుమారు 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. డ్రైవర్ అనిల్, ఓనర్ తిరుపతిని అదుపులోకి తీసుకుని వేములవాడ పోలీస్ స్టేషన్ కు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో సిబ్బంది రమేష్, తిరుపతి, రాజేష్ పాల్గొన్నారు.
సారథి, బిజినేపల్లి: స్నేహితులు కేవలం సుఖాల్లోనే కాదు కష్టాల్లోనూ తోడుంటామని నిరూపించారు. మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. బిజినేపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన బి.శివారెడ్డి ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు. తమవంతు సాయంగా అతని భార్య శ్రీదేవికి రూ.30వేలు పోగుచేసి ఆదివారం అందజేశారు. భవిష్యత్ లోనూ అతని భార్యాపిల్లలకు అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. శివారెడ్డి స్నేహితులను గంగారం గ్రామస్తులు అభినందించారు. సహాయం అందజేసిన వారిలో శ్రీనివాసులు, అశోక్, శివకుమార్, నిరంజన్, సాధిక్ […]
సారథి, ఎల్ బీ నగర్: శ్రీసాయి శాంతి సహాయ సేవాసమితి ఆధ్వర్యంలో లాలన వెల్ఫేర్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణలో వనస్థలిపురం గణేశ్ టెంపుల్ లో ఆదివారం పలువురికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వాసవి బిజినెస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ యేర్రం విజయ్ కుమార్ సతీమణి యెర్రం వనిత నిత్యావసర సరుకులు, రోబోటచ్ సంస్థ అధినేత యెర్రం బాలకృష్ణ సతీమణి ఉమాలక్ష్మి మాస్కులు, శానిటైజర్లను అందజేశారు. ముఖ్యఅతిథులుగా వనస్థలిపురం సీఐ మురళి మోహన్, స్ఫూర్తిసేవాసంస్థ అధ్యక్షుడు కొలిశెట్టి సంజయ్ […]
సారథి, వేములవాడ: అధికార పార్టీ నాయకుల భూకబ్జాల వ్యవహారాన్ని బయటకు తీస్తున్న జర్నలిస్ట్ రఘును అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జోగాపూర్ ఎంపీటీసీ మ్యాకల గణేష్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా భావించే జర్నలిజానికి విలువ లేకపోతే సామాన్య ప్రజలకు భద్రతే లేకుండా పోతుందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాచరిక పోకడలు మంచిది కాదని హితవుపలికారు. ప్రజలు అధికార పార్టీల పోకడలను నిశితంగా గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని […]
సారథి, బిజినేపల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం నాగర్ కర్నూల్ జిల్లా పాలెం జిల్లా వైద్యాశాఖ కార్యాలయ ఆవరణలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్యశాఖ అధికారులు, సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. వాతావరణ సమతుల్యతను కాపాడాలన్నారు. ఖాళీప్రదేశాల్లో మొక్కలు నాటాలని కోరారు. మనుషుల మనుగడ ప్రకృతితో ముడిపడి ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ బి.కృష్ణయ్య, హెల్త్ సూపర్ వైజర్ […]
మెదక్ ఆర్డీవో సాయిరాం సారథి, పెద్దశంకరంపేట: లారీల్లోని ధాన్యం లోడును వెంటనే ఖాళీచేయాలని మెదక్ ఆర్డీవో సాయిరాం ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలోని పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించారు. ముందుగా స్థానిక పౌరసరఫరాల శాఖ గోదాంలోకి వెళ్లి చూశారు. నిర్ణీత వ్యవధిలోనే సరుకులను పంపిణీ చేయాలని సూచించారు. వచ్చేనెల బియ్యం డబుల్ కోటా వస్తుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని గోదాం ఇన్ చార్జ్ ప్రదీప్ కుమార్ కు […]
సారథి, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు పంచాయతీలో వారం నుంచి కరోనా వైరస్ ఉధృతి 30శాతం పాజిటివ్ రేటు పెరుగుతోంది. ఈ విషయాన్ని వైద్యారోగ్యశాఖ ద్వారా జిల్లా కలెక్టర్ కు తెలియజేయగా, ఆయన స్పందించి ఆ ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా చేయాలని ఆదేశించారు. శుక్రవారం మోతుకులగూడెం, రేగులపాడు, బయ్యారం గ్రామాలను కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గ్రామస్తులను 14రోజుల పాటు వేరే ఊరికి వెళ్లకుండా, ఇతరులు ఆ […]