సారథి ప్రతినిధి, రామగుండం: కరోనా విజృంభిస్తున్న వేళ గోదావరిఖనిలోని గల్లీగల్లీల్లో పోలీసులు సోమవారం సాయంత్రం పెట్రోలింగ్ నిర్వహించారు. గాంధీచౌరస్తా నుంచి సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. పనీపాట లేకుండా తిరుగుతున్న 20 మంది వాహనాలను సీజ్ చేసి, వారిని ఐసొలేషన్ వ్యాన్ లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తరలించారు. వారికి కౌన్సిలింగ్ చేసి కరోనా వ్యాప్తిపై అవగాహన కల్పించారు. పెట్రోలింగ్ లో వన్ టౌన్ 2వ సీఐ రాజ్ కుమార్ గౌడ్, ఎస్సైలు ఉమాసాగర్, […]
ఎమ్మెల్యే అబ్రహం భరోసా కల్లుతాగి మృతిచెందిన కుటుంబాలకు పరామర్శ సారథి, మానవపాడు: కల్తీ కల్లు తాగి చనిపోయిన మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం ఆదివారం మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చేరుకుని పరామర్శించారు. నాయక వెంకటరాముడు కుటుంబానికి రైతుబీమా పథకం ద్వారా రూ.ఐదు లక్షలు ప్రభుత్వం నుంచి త్వరగా వచ్చే విధంగా చేయాలని వ్యవసాయ అధికారులతో మాట్లాడి ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. వెంకన్నకు టీఆర్ఎస్ పార్టీ సాధారణ సభ్యత్వం ఉందని, పార్టీ నుంచి సహకారం […]
పారిశ్రామికవేత్త కిషోర్ కుమార్ సారథి, మానవపాడు: ప్రముఖ పారిశ్రామిక వేత్త జల్లాపురం కిషోర్ కుమార్ జన్మదిన సందర్భంగా యువసైన్యం ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో యువకులు వచ్చి రక్తదానం చేశారు. కిషోర్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై యువకులతో మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో నిరుపేద కుటుంబాలకు బ్లడ్ ఉచితంగా లభిస్తుందన్నారు. జిల్లాలో రక్తదాన శిబిరాలకు తన సహకారం ఉంటుందన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు […]
సారథి, జగిత్యాల: అఖిల భారత యువజన కాంగ్రెస్ పిలుపుమేరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపునకు నిరసనగా జగిత్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గుండ మధు మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డివిరిచేలా ఉన్నాయని అన్నారు. వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాల డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నక్క జీవన్, ఎండీ నేహల్, బాస […]
సారథి ప్రతినిధి, రామగుండం: సింగరేణి ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను తొలిగించేందుకు యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. కాలనీలో కొందరు కార్మికులు ఆక్రమ కట్టడాలు చేపట్టడంతో డ్రైనేజీ, విద్యుత్ సరఫరాపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ మేరకు యాజమాన్యం ఒక కమిటీని నియమించి సింగరరేణి ప్రాంతాల్లోని ఆక్రమ కట్టడాలను గుర్తించి తొలగించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగాంగా ఆదివారం స్థానిక, పవర్ హౌస్ కాలనీలోని టీ2 123, 124 క్వార్టర్ల వెనక భాగంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు.
రూ.6లక్షల విలువైన కాపర్ కేబుల్ చోరీ నాగర్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ మండలం పులిజాల గ్రామంలోని మైత్ర సోలార్ ప్లాంట్ లో చోరీ జరిగింది. ప్లాంట్ లోని సోలార్ ప్యానల్ బోర్డులకు అమర్చే కాపర్ కేబుల్ ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. ఈ మేరకు స్టార్ క్యూ బెక్స్ కంపెనీ బాధ్యులు చిలక పూర్ణచంద్రారెడ్డి ఆదివారం నాగర్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. తమ కంపెనీ ఆధ్వర్యంలో 13మంది సెక్యూరిటీ, సూపర్ […]
సారథి, పెద్దశంకరంపేట: ఎంపీపీ నిధులను ప్రజాసమస్యల పరిష్కారానికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు ఆదివారం వినతిపత్రం అందజేసినట్లు ఎంపీపీల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం శ్రీనివాస్ తెలిపారు. మండల ప్రజాపరిషత్ కు కేటాయించిన 15 ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి ఇప్పటి నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని మంత్రికి మెమోరాండం సమర్పించినట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ నిధులు […]
సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలో రూ.ఐదులక్షల సీడీపీ నిధులతో నిర్మించనున్న గొల్ల యాదవ కురుమ సంఘం భవనం, రూ.43 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీరప్ప ఆలయం పనులకు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో దండిగా నిధులు ఖర్చుచేస్తున్నామని చెప్పారు. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమానికి ఎలాంటి లోటు రానివ్వలేదన్నారు. కులసంఘాల భవనాలు, ఆలయాలు, మురికి కాల్వలు, సీసీరోడ్లు, హైమాస్ట్ లైట్లు.. […]