సారథి, అచ్చంపేట: దేశంలో ఉన్న అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేస్తామని ప్రధాని మోడీ ప్రకటించడం గొప్ప నిర్ణయమని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రాఘవేందర్ కొనియాడారు. ఇప్పటి వరకు కోట్లాది మంది వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 18ఏళ్లు పైబడిన వాళ్లందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయించాలన్న నిర్ణయం చూస్తుంటే కరోనా నుంచి దేశప్రజలను కాపాడటమే కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యమన్నారు. అంతే కాకుండా దీపావళి(నవంబర్) వరకు దేశంలో గరీబ్ కళ్యాణ్ […]
సారథి, మానవపాడు(గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రాష్ట్రప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు బుధవారం ప్రారంభించారు. పేదలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలని కోరారు. సర్కారు దవాఖానల్లో అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కరోనాకు మెరుగైన వైద్యచికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ శృతిఓఝా, ఎస్పీ రంజన్ రతన్ కుమార్, డీఎంహెచ్ వో […]
సారథి, వేములవాడ: వేములవాడ పార్వతీ సమేత రాజరాజేశ్వరస్వామి ఆలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా ఉపాధ్యాయుల చంద్రశేఖర్ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలయ ధర్మకర్తల మండలి సమావేశ మందిరంలో ఉద్యోగులు తమ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా సిరిగిరి శ్రీరాములు, గౌరవ సలహాదారులుగా సంకేపల్లి హరికిషన్ , ప్రధాన కార్యదర్శిగా పేరుక శ్రీనివాస్, ట్రెజరర్ గా ఒన్నారం భాస్కర్, సంయుక్త కార్యదర్శిగా నక్క తిరుపతి, ఉపాధ్యక్షుడిగా వరి నరసయ్య, వెంకటలక్ష్మి, కార్యవర్గసభ్యులుగా అరుణ్ కుమార్, నునుగొండ రాజేందర్, గుండి నరసింహమూర్తి, […]
సారథి, ములుగు: స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్టీయూ) 75వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. బుధవారం సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సోలం క్రిష్ణయ్య పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నవాబుల హయాంలో 1946 మే 17న మగ్దూం మొహియుద్దీన్ ఇంట్లో కొందరు ఉపాధ్యాయుల సమావేశమై పురుడుపోసుకున్న సంఘం 1947 జూన్ 9న హైదరాబాద్ స్టేట్ టీచర్స్ యూనియన్ గా ఆవిర్భవించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత ఎస్టీయూగా రూపాంతరం చెంది నాటి నుంచి […]
ములుగు హాస్పిటల్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభం సారథి ప్రతినిధి, ములుగు: ములుగు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బుధవారం రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణఆదిత్యతో కలిసి డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ సెంటర్ లో 57 రకాల వైద్యపరీక్షలు చేయించుకోవచ్చన్నారు. సుమారు రూ.3కోట్ల వ్యయంతో పరికరాలను సమకూర్చి డయాగ్నోస్టిక్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనాను పూర్తిగా […]
సారథి, కొల్లాపూర్: కరోనా కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజలను పీడిస్తున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు డి.శేఖర్ మండిపడ్డారు. బుధవారం కొల్లాపూర్ మండలంలోని కుడికిళ్లలో భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వినూత్నరీతిలో ఆటోను లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు డి.శేఖర్ మాట్లాడుతూ.. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల వల్ల సామాన్య ప్రజలపై భారం పడుతుందని, వెంటనే తగ్గించాలని […]
సారథి, పెద్దకొత్తపల్లి(కొల్లాపూర్): గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఎంపీడీవో కృష్ణయ్య సూచించారు. బుధవారం స్థానిక ఎంపీడీవో ఆఫీసులో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతుల కల్లాలు, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, పలు రకాల పనుల పురోగతిపై మాట్లాడారు. వానాకాలంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ సారథి, హైదరాబాద్: కరోనా పరిస్ధితుల కారణంగా కష్టాల పాలైన కళాకారుల కుటుంబాలను ఆదుకునే దిశగా ‘రైస్ బకెట్ చాలెంజ్’, ‘ఫీడ్ ది నీడీ’ స్వచ్ఛంద సేవాసంస్థలు ముందుకొచ్చి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశాయి. కర్మన్ ఘాట్ శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్ లో బుధవారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేసి అందజేశారు. గతేడాది కరోనా మొదలైనప్పటి నుంచి ఉత్సవాలు, శుభకార్యాలు, సభలు, సమావేశాలు సజావుగా జరుపుకోలేని కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో అనేకమంది […]