సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలం దానంపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామ ఉపసర్పంచ్ కొడుకు కట్ట శంకర్, పంచాయతీ కోఆప్షన్ సభ్యుడు పుట్ల బేతయ్య, కట్ట చిన్నరవి, కట్ట వెంకయ్య, కట్ట లింగయ్య, నర్సింగ్, శివకుమార్, సాయిలు, యాదయ్య, యాదమ్మ, శ్రీకాంత్, దుర్గయ్య, గంగయ్య సతీష్ తో పాటు పలువురు పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు మురళీపంతులు, ఎంపీపీ […]
సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్ రాజరాజేశ్వర స్వామి వారి గోశాలను ఆదివారం ఆలయ ఏఈవో సంకేపల్లి హరికిషన్ సందర్శించారు. వర్షాకాలం వచ్చినందున గోశాలలోని కోడెలకు గిట్టల చీల్పు, నోటి బొబ్బలు, పొదుగు వాపు, పిడుదులు, గోమార్లు సోకకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రతి కోడెకు వర్షాకాలంలో విధిగా టెస్టులు చేయించాలని సూచించారు. డీ వార్మింగ్ చేయించాలని, ఇతర వ్యాధుల బారిన పడకుండా తప్పనిసరిగా టీకాలు వేయించాలని గోశాల ఇన్ చార్జ్ శంకర్ కు సూచించారు. […]
సారథి, ఏటూరునాగారం: ములుగు ఎమ్మెల్యే సీతక్క గొప్ప హృదయం చాటుకున్నారు. ఇటీవల మరణించిన కుటుంబాలను ఆదివారం పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన కైసర్ పాషా కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం చేశారు. అలాగే గరా రాములు కుటుంబానికి రూ.రెండువేల చొప్పున సాయం చేశారు. అలాగే కరోనాతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరుసవడ్ల వెంకన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఆయూబ్ […]
సారథి, ఎల్బీ నగర్: కాలనీల్లో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని ఎంఆర్‌డీసీ చైర్మన్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన నియోజకవర్గంలోని మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వీరన్నగుట్ట, షిర్డీసాయినగర్ కాలనీల్లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. అనంతరం కాలనీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్నల్ లైన్స్, మిగతా డ్రైనేజీ పనులకు ప్రతిపాదనల ప్రకారం నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. సీసీరోడ్లు, ఇతర సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. […]
సారథి, రామడుగు: కరోనా మహమ్మారి పేదల బతుకులను ఛిద్రం చేసింది. ఈ సమయంలో బడుగు జీవులకు ఆపన్నహస్తం అందిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు ఎందరో మహానుభావులు. ఆదరణ సేవాసమితి, సర్వ్ టూ సొసైటీ సంయుక్తంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తీర్మాలపూర్ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. వారి చదువు పూర్తయినందున ఏదైనా ఉద్యోగ అవకాశం ఇప్పించే ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే కొక్కెరకుంట గ్రామంలో […]
సారథి, జగిత్యాల: జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామం బావాజీపల్లికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త కె.రామకృష్ణ అనారోగ్యం చనిపోయారు. అలాగే వెల్దుర్తి గ్రామానికి కండ్లే గౌతమ్ గుండెపోటుతో మరణించగా వారి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం పరామర్శించారు. అలాగే జగిత్యాల రూరల్ మండల జాబితాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త నాంసాని సాయి తండ్రి రాజన్న ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మాజీ ఎంపీటీసీ సుగుణ తండ్రి భారత దావీదు అనారోగ్యంతో మరణించగా వారి […]