సారథి, సిద్దిపేట: ప్రజా నాయకుడు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత అన్నారు. గురువారం మంత్రి జన్మదిన వేడుకలను హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎంపీపీ లకావత్ మానస, అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటి చైర్మన్ […]
సారథి, జగిత్యాల: జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామ శివారులో పెద్దమ్మ తల్లి మ్యాంగో సెంటర్ లో కడార్ల రాజేశ్వర్ ఆధ్వర్యంలో వలస కార్మికులకు గురువారం రూ.50వేల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లారెడ్డి, కౌన్సిలర్లు పంబాల రామ్ కుమార్, కుసరి అనిల్, పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు ఆనంద్ రావు, ఏఎంసీ డైరెక్టర్ మోహన్ రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.
సారథి: పెద్దశంకరంపేట: ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు జన్మదిన వేడుకలను పెద్దశంకరంపేట ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అపరచాణిక్యుడు, కార్యదక్షుడు, ట్రబుల్ షూటర్ గా పేరొందిన మంత్రి హరీశ్ రావు తెలంగాణ రాష్ట్రానికే తలమానికం అన్నారు. హరీశ్ రావు లాంటి నేత తెలంగాణలో పుట్టడం […]
సారథి, రామడుగు: కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ 45 మంది లబ్ధిదారులకు రూ.45,05,200 విలువైన చెక్కులను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నివర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆడపిల్లల పెళ్లి పేదలు అప్పుచేసి చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా ప్రతిఒక్కరికీ రూ.లక్ష నూట పదహార్లు నేరుగా అందిస్తున్నారని పేర్కొన్నారు. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో నాయకులంతా గుమికూడి చెక్కులు […]
అన్ని భూముల డిజిటలైజేషన్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రూ.10లక్షల వ్యయంతో నిర్మించనున్న రెస్ట్ రూం, సురక్షిత తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, ఆఫీస్ రినవేషన్ రూం పనులను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ తో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ కు వచ్చే రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. గతంలో తహసీల్దార్ ఆఫీసుకు వచ్చేవారు చెట్లకింద […]
సారథి, కొల్లాపూర్: కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చుక్కయిపల్లి చాకలి మడుగువాగుపై రూ.40లక్షల వ్యయంతో చేపట్టనున్న కల్వర్టు బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గురువారం భూమిపూజ చేశారు. చాకలిమడుగుపై కల్వర్టు బ్రిడ్జి లేక ప్రజలు, రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బ్రిడ్జి నిర్మించడం ద్వారా చుక్కయిపల్లి ప్రజలు, రైతుల కష్టాలు తీరనున్నాయని, రైతులు తమ పొలాలకు వెళ్లడానికి, ధాన్యాన్ని తరలించడానికి ఇబ్బందులు ఉండవని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గున్ రెడ్డి నరేందర్ […]
సారథి, రామాయంపేట: ఆరుగాలం శ్రమించి పండించిన బుధవారం రాత్రి కురిసిన భారీవర్షానికి నీటిపాలైంది. రెక్కలకష్టం మట్టిలో కలిసిందని ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నిజాంపేట గ్రామానికి చెందిన చౌదర్ పల్లి స్వరూప. తనకున్న రెండెకరాల్లో యాసంగి సీజన్ లో వరి పంట సాగుచేసింది. వరి నూర్పిడి చేసి నెలరోజుల క్రితం నిజాంపేట వ్యవసాయ సబ్ మార్కెట్ లో నిజాంపేట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు సెంటర్ కు వడ్లను తీసుకొచ్చింది. ‘మా ఆయన ఆరోగ్యం […]
ఒక్కోబస్తాకు 3 కిలోల తరుగు రాస్తారోకో చేపట్టి చల్మేడ గ్రామరైతులు సారథి, రామాయంపేట: సుమారు 30 లారీల వరిధాన్యం కొనుగోలు సెంటర్లలోనే ఉన్నాయని, ఎండకు ఎండుతూ.. వానకు నానుతున్న వడ్లను కాంటాలు చేయడం లేదని, రైస్ మిల్లుకు తరలించడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ గురువారం మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మేడ గ్రామ రైతులు మెదక్- సిద్దిపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. రామయంపేట సొసైటీ ఆధ్వర్యంలో కొన్నిరోజుల క్రితం […]