Breaking News

Month: May 2021

అన్నదాతను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఐ

అన్నదాతను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఐ

సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మపూర్, కొనేరుపల్లి గ్రామాల్లో కురిసిన అకాలవర్షాలకు పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కొయ్యడ సృజన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన పలు గ్రామాల్లో నష్టపోయి ధాన్యాన్ని పరిశీలించారు. వడ్లను సకాలంలో కొనుగోలు చేయడంలో మిల్లర్లు కొర్రీలు పెట్టడం ద్వారా కల్లంలోనే తడిసి ముద్దయ్యాయని, తద్వారా రైతులకు తీవ్రనష్టం కలిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్యాడీ క్లీనర్లు, టార్పలిన్ కవర్లు లేకపోవడం, తాలు పేరుతో సకాలంలో కొనకపోవడంతో […]

Read More
ఎమ్మెల్యే సీతక్క గొప్ప మనస్సు

ఎమ్మెల్యే సీతక్క గొప్ప మనస్సు

సారథి, మంగపేట: ములుగు జిల్లా మంగంపేట మండలంలోని నర్సింహాసాగర్ గ్రామంలో కరోనాతో బాధపడుతున్న 10 కుటుంబాలకు ఎమ్మెల్యే సీతక్క స్వయంగా వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనాతో మరణించిన ఈసం లేపాక్షి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, భౌతికదూరం పాటిస్తూనే మాస్కులు ధరించాలని సూచించారు. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి ప్రజలు బయటకు రావొద్దని సీతక్క కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, ఎస్టీ సెల్ […]

Read More
రైస్ మిల్లు ప్రారంభం

రైస్ మిల్లు ప్రారంభం

సారథి: పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం బొడగట్టు గ్రామంలో నూతనంగా నిర్మించిన రైస్ మిల్లును నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రాంత రైతులకు ఇది ఎంతో సదుపాయంగా ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, రైస్ మిల్లు యాజమాన్యం కనకరాజు, కందుకూరి రవి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

Read More
గీత దాటితే చర్యలు తప్పవు: ఎస్పీ

గీత దాటితే చర్యలు తప్పవు: ఎస్పీ

సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శనివారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో వేములవాడ- తిప్పాపూర్ బస్టాండ్ సమీపంలో వాహనాలను తనిఖీచేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి పది గంటల తర్వాత రోడ్లపై తిరుగుతున్న వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా లాక్ డౌన్ కు సహకరించాలని కోరారు. ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన పది షాపుల యజమానులపై చర్యలు తీసుకున్నారు. ఆయన […]

Read More
భయపెడుతున్న ‘బ్లాక్ ఫంగస్’

భయపెడుతున్న ‘బ్లాక్ ఫంగస్’

సారథి, హెల్త్ డెస్క్: అసలే కరోనా కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. ఎక్కడి నుంచి ఎక్కడికి దాపురిస్తుందో తెలియడం లేదు. ఎప్పుడు ఎవరిని బలితీసుకుంటుందో అంతుచిక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకున్న ప్రజలను మరో కొత్త రోగం వణికిస్తోంది. ఇది అంటువ్యాధి కాదు.. ఎవరికి పడితే వారికి రాదు. ఇది కాస్త ఉపశమనం కలిగించే విషయం. కరోనా వ్యాధితో కోలుకున్న పేషెంట్లకు ఈ రోగం వస్తోంది. తగిన సమయంలో గుర్తించకుంటే ప్రాణాలు తీస్తోంది. అదే […]

Read More
నిరాడంబరంగా రంజాన్

నిరాడంబరంగా రంజాన్

సారథి, రామడుగు: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం పండగలపై పడింది. అందులో భాగంగానే శుక్రవారం రంజాన్ నిరాడంబరంగా ఇంట్లోనే జరుపుకున్నారు. ఉదయాన్నే ఇంట్లోనే నమాజ్ చేసి సెమియా, బిర్యానీ వంటి వంటకాలు తయారుచేసి భుజించారు.

Read More
ఆ సర్పంచ్ గొప్ప మనస్సు.. ఎందుకో తెలుసా?

ఆ సర్పంచ్ గొప్ప మనస్సు.. ఎందుకో తెలుసా?

సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ యువకుడు కరోనాతో మృతిచెందాడు.  యువకుడి మృతితో గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో మొదటి కరోనా మరణం జరగడంతో గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. శవాన్ని పూడ్చి పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో సర్పంచ్ కర్నె లక్ష్మీనారాయణ పీపీఈ కిట్టు ధరించి అంత్యక్రియలు చేయడానికి ముందుకొచ్చారు. అక్కడే ఉన్న పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్ తో పాటు మరో నలుగురు యువకులు సర్పంచ్ […]

Read More
ఇంటింటా ఫీవర్ సర్వే

ఇంటింటా ఫీవర్ సర్వే

సారథి, సిద్దిపేట ప్రతినిధి: నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్ పట్టణంలోని నాలుగో వార్డు పరిధిలోని బాలాజీనగర్, కాకతీయ నగర్ లో ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించారు. అలాగే కరోనా వ్యాధి పీడితుల యోగక్షేమాలను సిబ్బంది అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఐలేని అనితారెడ్డి, ఆర్ పీ శోభ, ఆశావర్కర్ కాంత పాల్గొన్నారు.

Read More