Breaking News

Day: May 29, 2021

జూన్ 15 నుంచి ‘రైతుబంధు’

జూన్ 15 నుంచి ‘రైతుబంధు’

సారథి ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల‌కు జూన్ 15 నుంచి రైతు బంధు సాయం పంపిణీ చేయ‌నున్నారు. జూన్ 25వ తేదీలోగా రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ పూర్తికానుంది. ఈ మేర‌కు సీఎం కేసీఆర్ వ్యవసాయ‌శాఖ‌పై చేసిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. పార్ట్ బీ నుంచి పార్ట్‌ ఏలోకి చేరిన రైతుల‌కు రైతుబంధు వ‌ర్తించ‌నుంది. జూన్ 10 క‌టాఫ్ తేదీగా ఈ ప‌థకం వ‌ర్తింపు ఉండ‌నుంది. విత్తనాలు, ఎరువుల్లో క‌ల్తీని అరిక‌ట్టాల‌ని సీఎం సూచించారు. క‌ల్తీ […]

Read More
ఎడ్లబండ్లపై బండ్లపాడుకు ఎమ్మెల్యే సీతక్క

ఎడ్లబండ్లపై బండ్లపాడుకు ఎమ్మెల్యే సీతక్క

సారథి, ములుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం అడవి రంగాపుర్(నారాయణ పూర్)గ్రామంలోని బండ్లపాడు కోయగూడెంలో శనివారం ఎమ్మెల్యే సీతక్క నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఆదుకోకపోవడం దారుణమన్నారు. ఊరికి దూరంగా అడవినే నమ్ముకొని బతుకుతున్న కోయగూడెం ప్రజలకు నెలకు రూ.6వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఫౌంహౌస్ ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు రావాలన్నారు. కరోనా గ్రామాలకు కూడా విస్తరించి ప్రాణాలు కోల్పోతున్నారని, టెస్టుల సంఖ్య […]

Read More
నకిలీ సీడ్స్ అమ్మితే పీడీయాక్టు

నకిలీ సీడ్స్ అమ్మితే పీడీయాక్టు

సారథి ప్రతినిధి, నాగర్ కర్నూల్: జిల్లా రైతులు, ప్రజలకు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మడం, సరఫరా చేయడం, తయారుచేయడం చేస్తే కఠినచర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ వై.సాయిశేఖర్ హెచ్చరించారు. వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు అలా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వ్యాపారం చేయుదలుచుకున్నవారు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడొద్దని సూచించారు. ప్రభుత్వం అనుమతి పొందిన కంపెనీకి చెందిన విత్తనాలను […]

Read More
వైద్యసిబ్బంది సేవలు భేష్: ఎమ్మెల్యే సీతక్క

వైద్యసిబ్బంది సేవలు భేష్: ఎమ్మెల్యే సీతక్క

సారథి, తాడ్వాయి: కరోనా సమయంలో వైద్యసిబ్బంది సేవలు అభినందనీయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న 30 మంది ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలను శాలువాతో ఘనంగా సన్మానించి చీరను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ వైరస్‌ ‌తమనే అంతం చేస్తుందని తెలిసి కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కరోనా బాధితులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని కొనియాడారు. ఇలాంటి […]

Read More